Business Ideas: తక్కువ పెట్టుబడి.. ప్రతిసారీ లాభం పొందే బిజినెస్.. నో రిస్క్..

www.mannamweb.com


Business Ideas: ఆధునిక కాలంలో బతకాలంటే రెండు చేతులా సంపాదించాలనే పరిస్థితులు వచ్చేశాయి. అందుకే ఉద్యోగాలతో పాటు ఏదైనా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. అలాంటి వారికి ఒక చక్కటి అవకాశం వచ్చేసింది. లాభదాయకమైన వ్యాపార అవకాశం కోసం వెతుకుతున్నవారికి.. కొంచెం సృజనాత్మకత ఉన్నట్లయితే డెకరేషన్ వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు బయట ఆఢంబరంగా ఫంక్షన్లు చేసుకోవటం పెరగటం ఈ వ్యాపారంలో అనేక అవకాశాలను తీసుకొచ్చింది. ప్రత్యేక తేదీల్లో ప్రపోజ్ చేయటం నుంచి కొత్త ఆఫీసుల ప్రారంభం, బేబీ షవర్‌లు, నిశ్చితార్థాలు, వివాహాలు, వార్షికోత్సవాలు, సంతోషకరమైన సమావేశాలను నిర్వహించడం వరకు అన్ని కార్యక్రమాలకు ఆకర్షనీయమైన డెకరేషన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇందుకోసం లైట్లు, పూలు, ఆకర్షనీయమైన బెలూన్ల వంటివి ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యాపారాన్ని కనీసం రూ.25,000 పెట్టుబడి నుంచి కూడా ప్రారంభించవచ్చు. మెుదట్లో అవసరమైన వస్తువులను అద్దెకు తెచ్చుకోవటం ద్వారా నిర్వహించవచ్చు. అయితే తర్వాతి కాలంలో సొంత పెట్టుబడి ద్వారా సామాగ్రిని కొనుగోలు చేస్తే ఖర్చులు తక్కువవుతాయి. ఆన్ లైన్ ఆర్డర్లు లేదా షాపు ఏర్పాటు ద్వారా దీనిని ప్రారంభించవచ్చు. ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. తర్వాతి కాలంలో 35 నుంచి 40 శాతం లాభాలను పొందవచ్చు. పండుగలతో సంబంధం లేకుండా 365 రోజులూ ఏదో ఒక వేడుకలు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ప్రత్యేకించి పెళ్లిళ్లు, శుభకార్యాల కాలంలో అధిక డిమాండ్ ఉంటుంది. దీనికోసం పువ్వులు, ఆకులు, మంత్రముగ్ధులను చేసే లైట్లు, సొగసైన బొకేలు, LED డిస్‌ప్లేలు వంటి వస్తువులు ఎక్కువగా వినియోగిస్తుంటారు.