మెడ నల్లగా ఉందా.. అయితే ఈ సూపర్ చిట్కాలతో మీ మెడ మెరవాల్సిందే

మామూలుగా ముఖం తెల్లగా ఉండి మెడ భాగం నల్లగా ఉంటే అందంగా కనిపించరు. ముఖానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మెడ భాగానికి ఇవ్వరు. అందుకే మేడ భాగం ఎక్కువ నల్లగా ఉంటుంది.


అయితే మోడరన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఈ మెడ భాగం నల్లగా ఉంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాలి. మెడ పై నలుపుదనం పోగొట్టుకోవడానికి చాలామంది ఎన్నెన్నో చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇదిఅయితే ముఖం కలర్ ఒకలాగా, మెడ కలర్ ఒకలాగా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయట.

ఆడవాళ్లలో హార్మోన్ల మార్పుల వల్ల, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మెడ భాగం నల్లగా మారుతుందని చెబుతున్నారు. కానీ ఇది ఆడవాళ్ల అందాన్ని పాడుచేస్తుందట. అయితే మెడపై నలుపుదనం పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నూనెను మెడపై నలును వదిలించుకోవడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడి చేసి మెడభాగంలో అప్లై చేయాలి. తర్వాత వేళ్లతో తేలికగా స్క్రబ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ముదురు రంగు తగ్గి తెలుపు రంగులోకి వస్తుందట.

చింతపండు, పెరుగుతో కూడా మెడ భాగాన్ని మొఖంలా అందంగా మెరిసేలా చేయవచ్చట. అయితే ఇందుకోసం ముందుగా చింతపండును వేడినీటిలో నానబెట్టి, గుజ్జు తీసి అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, పసుపు, వేసి బాగా కలపాలట. దీన్ని నల్లగా ఉన్న మెడ భాగంలో అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయాలట. చింతపండులోని ఆల్ఫా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ అలర్జీ గుణాలు మెడపై నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అదేవిధంగా మెడ పై ఉన్న నలుపు పోవాలి అంటే నారింజ తొక్క పాలు కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఆ ప్రదేశంలో అప్లై చేయాలని కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. నారింజ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెడ నల్లబడటానికి కారణమయ్యే టైరోసిన్ సమ్మేళనాలతో పోరాడతాయట. అలాగే కలబంద గుజ్జులో పంచదార, పాలు కలిపి మెడకు స్క్రబ్ చేయాలట. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెడను తెల్లగా చేయడానికి సహాయపడతాయని చెబుతున్నారు.