షుగర్, బీపీ ఉన్నవారు జామపండు తినొచ్చా?

జామపండు ధర తక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ అనే విషయం దాదాపు అందరికి తెలిసిందే. పల్లెటూరిలో ఉండే ప్రతి ఇంట్లో కూడా దాదాపు జామ చెట్టు ఉండే ఉంటుంది.
జామచెట్టు పండ్లు మాత్రమే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివి,జామ ఆకులతో పంటి నొప్పికి వైద్యం చేస్తారు. ఈ ఆకులతో చేసిన టీ తాగితే బరువు తగ్గుతారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి కూడా జామపండు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.


ఇందులో ఫోలేట్ పుష్కలంంగా ఉంటుంది. ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. పీసీఓఎస్ తో బాధపడే మహిళలు జామకాయ తింటే జామలో సమృద్ధిగా ఉండే రాగి హార్మోన్ల ఉత్పత్తి, శోషణకు సహాయపడుతుంది. జామపండులో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది.
ఇది కంటిచూపునకు తోడ్పడే విటమిన్. రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది.

మీ డైట్లో జామపండు చేర్చుకుంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి, దృష్టి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. క్యాటరాక్ట్ సమస్య రాకుండా అదుపు చేస్తుంది. జామపండులో విటమిన్ B3, B6 ఉంటాయి. ఈ పోషకాలు మెదడు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ నరాలకు విశ్రాంతిని అందిస్తుంది.

తద్వారా మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గర్భిణులు జామపండు తింటే.. తల్లీ, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
జామకాయలో విటమిన్లు B, C, A, E, టోకోఫెరోల్, ఐసోఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జామకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది, కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది, గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇవి తినడం వల్ల గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ సమస్య ఉన్న స్త్రీలలో గర్భస్రావం, శిశు మరణాల్లాంటివి సాధారణం.

జామకాయలు ఆ సమస్యను చాలా వరకూ నివారిస్తాయని అధ్యయనాల్లో తేలింది. జామపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్లే మనకు అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పడిపోకుండా చేసి సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది. ఇందులోని ట్రైగ్లిజరాయిడ్లు చెడు కొవ్వుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జామకాయ లేదా పండుని రోజువారి ఆహారంలో తప్పక చేర్చుకొండిక.