కొన్నిసార్లు సెల్ ఫోన్లు కూడా పేలతాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఛార్జింగ్ సమయంలో ఫోన్లు పేలిన ఘటనలు చూశాం. అయితే, బ్రెజిల్ లో ఓ మహిళ ప్యాంటు జేబులో సెల్ ఫోన్ పేలిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ మహిళ భర్తతో కలిసి సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తోంది. ఆ సమయంలో సెల్ ఫోన్ ను బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంది. ఒక్కసారిగా ఫోన్ పేలడంతో మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఆమె నడుము భాగానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సూపర్ మార్కెట్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.