మనుషులు తమ జీవితాలను సంతోషమయం చేసుకోవాలంటే ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలని ఆచార్య చాణక్య తెలిపారు. మంచి పనులు చేయని వారు జీవితంలో విజయం సాధించలేరు, సంతోషంగా ఉండలేరు.
వారు ఎప్పుడూ ఏదో ఒక రకమైన భయం, ఇబ్బందులతో బాధపడుతుంటారు. జీవితంలో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలంటే ఈ 4 పనులకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు.
1. బాహ్యాడంబరం
బాహ్యాడంబరాల్లో నిత్యం బిజీగా ఉన్న వారి జీవితంలో ఎప్పుడూ శాంతి ఉండదు. చాణక్య నీతి ప్రకారం అటువంటి వారు జీవితంలో ప్రాధాన్యతలేని పనులతో బిజీగా ఉంటారు.
అబద్ధాలు, తప్పుడు పనులలో మునిగితేలుతుంటారు. ఈ విధమైన ప్రవర్తన వారికి పలు ఇబ్బందులకు తెచ్చిపెడుతుంది.
2. కోపం
కోపం మనిషికి గల అతి పెద్ద శత్రువు. అది మనిషిని నిలువుగా తినేస్తుంది. కోపం కలిగిన వ్యక్తికి గౌరవం లభించదని చాణక్య నీతి చెబుతుంది.
కోపంగా ఉన్న వ్యక్తికి తోటివారు దూరంగా ఉంటారు. కష్టకాలం వచ్చినప్పుడు కోపిష్టులు ఒంటరిగా మిగిలిపోతారు. బాధపడతారు.
3. అహంకారం
మనిషి అహంకారానికి దూరంగా ఉండాలి. అహంకారం అన్నింటినీ నాశనం చేస్తుంది. చాణక్య నీతి ప్రకారం అహంకారం.. మనిషిని సత్యానికి దూరం చేస్తుంది.
అలాంటివారు తమను తాము ఉన్నతంగా భావిస్తూ తప్పులు చేస్తుంటారు.
అహంకారులకు అందరూ దూరంగా ఉంటారు. అహంకారులు తమ జీవితంలో పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
4. బద్ధకం
ఆచార్య చాణక్యుడు.. మనిషి బద్ధకానికి దూరంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చాడు. బద్ధకం అనేది మనిషి ప్రతిభను నాశనం చేస్తుంది.
బద్ధకం కారణంగా మనిషి సదవకాశాలను కోల్పోవలసి వస్తుంది. బద్ధకంలో మునిగేవారు లక్ష్యానికి దూరంగా ఉంటారు.
మనిషి బద్ధకానికి దూరంగా ఉండడం వలన చుట్టుపక్కలవారినీ మేలు కలుగుతుంది.