China News: అప్పులున్నోళ్లకి చైనా కొత్త శిక్షలు.. కిమ్ మామే బెటర్ అనుకుంట..!!

www.mannamweb.com


Bad Debts: ప్రపంచ శక్తిగా ఎదిగిన చైనా సంచలన నిర్ణయాలు తీసుకోవటం వాటిని అమలు చేయటంలో దిట్ట. కరోనా తర్వాత ఏర్పడిన ఆర్థిక అస్థిరతలు చైనా ఆర్థిక వ్యవస్థను అప్పుల కుప్పలుగా మార్చేశాయి. పెద్దపెద్ద కంపెనీలు సైతం ఈ క్రమంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైనా తాజాగా మరో సంచలనంతో ముందుకొచ్చింది.

చైనాలోని ప్రజలు తమ అప్పులను తీర్చటంలో విఫలమైతే ప్రస్తుతం అష్టకష్టాలు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం లోన్ డిఫాల్ట్ అయిన వ్యక్తులకు హైస్పీడ్ రైలు సేవలు, విలాసవంతమైన హోటళ్లలో స్టేతో పాటు ఇతర ఖర్చుల పరిమితులు వంటి తీవ్రమైన పరిమితులను ఎదుర్కోనున్నారు. తాజా చర్యలతో క్విన్ హువాంగ్‌షెంగ్ కథల్లో మాదిరిగా చైనా తన ప్రజల విషయంలో సాంప్రదాయ పద్ధతులను అవలంభిస్తోందని తెలుస్తోంది.

చైనా కఠినమైన చర్యలు వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేయటంతో పాటు ఆర్థిక వ్యయాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మిలియన్ల మంది వ్యక్తులకు వివిధ సేవలు, విలాసాల నుంచి నిరోధించి. వారిని బ్లాక్ లిస్ట్‌లో ఉంచింది. ఇది 2019 చివరి నుంచి దాదాపు 50% పెరిగిందని సమాచారం. అమెరికా వంటి దేశాలతో పోల్చితే చైనాలో వ్యక్తిగత దివాలా చట్టాలు మరింత కఠినంగా ఉంటాయి. అప్పుల బాధలో ఉన్న వ్యక్తులు కొత్తగా ప్రారంభించే సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. ఈ పద్ధతి అన్యాయమని కొందరు చైనీస్ నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చైనాలో వ్యక్తిగత రుణాల పెరుగుదలకు హౌసింగ్ బూమ్ కారణంగా ఉంది. జప్తు చేయబడిన గృహాలు, క్రెడిట్ కార్డ్‌లపై ఆధారపడటం పెరుగుతోంది. ప్రస్తుతం చైనాలో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ US తరహా ఆర్థిక సంక్షోభానికి బఫర్‌గా పనిచేస్తుంది. చైనా తన ఆర్థిక వ్యవస్థను రియల్ ఎస్టేట్ నుండి వ్యక్తిగత వ్యయానికి మార్చడానికి ప్రయత్నిస్తుండగా.. డిఫాల్టర్లపై శిక్షాత్మక చర్యలు బ్లాక్ మార్కెట్‌ను సృష్టిస్తున్నాయి. సంపద పంపిణీని మరింత సమానం చేసే వ్యక్తిగత దివాలా వ్యవస్థ కోసం పిలుపునిస్తున్నాయి .