ఏడేళ్ల వయస్సులో కోడింగ్.. 16 ఏళ్ల వయస్సులోనే రూ.100 కోట్ల కంపెనీ.. అవస్థి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే

www.mannamweb.com


సాధారణంగా 16 సంవత్సరాల వయస్సు విద్యార్థులు అంటే పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్ చదవడంపై దృష్టి పెడుతూ ఉంటారు. 16 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థినికి సొంతం గా కంపెనీ ఉందని చెబితే ఎవరూ కూడా నమ్మరు.

అయితే అవస్థి అనే విద్యార్థిని మాత్రం ఏడేళ్ల వయస్సులో కోడింగ్ నేర్చుకుని టెక్ పరిశ్రమలో అరుదైన ఘనతలను సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఏకంగా 100 కోట్ల రూపాయలు కావడం అవస్థి పూర్తి పేరు ప్రాంజలి అవస్థి( Pranjali Awasthi ) కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ విద్యార్థిని పేరు మారుమ్రోగుతోంది. డెల్వ్.ఏఐ ను ఆమె స్థాపించగా ఈ స్టార్టప్ గమనార్హం. ఈ సంస్థలో 10 కంటే ఎక్కువమంది ఉద్యోగులు పని చేస్తున్నారని భోగట్టా. 2022 సంవత్సరంలో ప్రాంజలి ఈ కంపెనీని స్థాపించారు.

తండ్రి ప్రోత్సాహం వల్లే ప్రాంజలి కెరీర్ పరంగా ఈ స్థాయిలో సక్సెస్ సాధించారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 11 సంవత్సరాల వయస్సులో ప్రాంజలి ఫ్యామిలీ భారత్ నుంచి ఫ్లోరిడా( Florida )కు మారింది. 13 సంవత్సరాల వయస్సులోనే ప్రాంజలి అవస్థి రీసెర్చ్ ల్యాబ్ లో ఇంటర్న్ షిప్ ద్వారా బిజినెస్ ప్రపంచంలో అడుగు పెట్టడం గమనార్హం. కరోనా సమయంలో ప్రాంజలి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ లపై దృష్టి పెడుతున్నారు. 3.7 కోట్ల రూపాయలతో ప్రారంభ నిధులను సేకరించి ప్రాంజలి కంపెనీని మొదలుపెట్టినా ఆమె కంపెనీ విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ప్రాంజలి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రాంజలి అవస్థి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ప్రాంజలి అవస్థి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రాంజలి అవస్థి తల్లీదండ్రులను సైతం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.