ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు భారీ వర్షాలు

www.mannamweb.com


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపానుగా రూపాంతరం చెందలేదు. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కి.మీ, నాగపట్టణానికి 340, పుదుచ్చేరికి 410, చెన్నైకి 470 కి.మీ.

దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని, సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్‌ (పుదుచ్చేరి), మహాబలిపురం (తమిళనాడు) మధ్యలో తీరం దాటవచ్చని తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో శుక్ర, శనివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు. మరోపక్క, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రభుత్వానికి నిరంతరం సంకేతాలిస్తోంది. ఈవోఎస్‌-06, ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలు ఫంగన్‌ తుపాను సమాచారాన్ని అందిస్తున్నాయి.