Daaku Maharaaj First Review: డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. క్రిటిక్ షాకింగ్ కామెంట్స్

www.mannamweb.com


నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. హిట్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా, ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్‌లో స్పెప్పులేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్నది. ఈ సినిమా గురించి క్రిటిక్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

డాకు మహారాజ్ సినిమా కథ డిమాండ్ చేయడంతో ఖర్చు విషయంలో రాజీ పడకుండా తెరకెక్కించారు. సుమారుగా 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ హక్కులు సుమారుగా 83 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఈ మూవీ 84 కోట్ల షేర్ 168 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సిందే. సూపర్ హిట్ టాక్ రావాలంటే.. దాదాపు 100 కోట్ల షేర్.. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇలాంటి భారీ అంచనాలు, పాటలు హిట్ టాక్ అందుకోవడం మధ్య డాకు మహారాజ్ గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే దుబాయ్ సెన్సార్ సందర్భంగా క్రిటిక్ ఉమేర్ సంధూ తనదైన శైలిలో రివ్యూను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ సినిమాను, బాలకృష్ణ పెర్ఫార్మెన్స్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ అని ఆయన తన ట్వీట్‌లో చెప్పారు.

ఉమేర్ సంధూ తన పోస్టులో.. సెన్సార్ బోర్డు నుంచి డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ. మాస్ ప్రేక్షకల కోసం డిజైన్ చేశారు. యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, హ్యుమర్ లాంటి అంశాలను దట్టించి ఈ సినిమాను రూపొందించారు. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్‌ చూపించిన తీరుతో ప్రేక్షకుడికి పైసా వసూల్. ఇవే అంశాలు ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పిస్తాయి అని తన రివ్యూలో పేర్కొన్నారు.

డాకు మహారాజ్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్‌పై ప్రశంసలు కురిపించారు. తమన్ ప్రతిభను కొనియాడారు. ఈ సినిమాలోని బీజీఎం మంచి జోష్‌ను కలిగిస్తుంది. తమన్ అందించిన బీజీఎం చాలా అద్బుతంగా ఉంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్‌లోనే చూడండి. మస్తు మజా వస్తుంది అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నారు.

అయితే సదరు క్రిటిక్ ఉమేర్ సంధూ ఇచ్చిన రివ్యూలో ఎక్కువ శాతం తలకిందలయ్యాయి. అయితే హిట్ అని చెప్పిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. డిజాస్టర్ అని చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకొన్నాయి. కాబట్టి ప్రేక్షకులు ఇతడి రివ్యూలను కాస్త జాగ్రత్తగానే పరిగణనలోకి తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.