డేంజర్ గురూ.. చికెన్‌లో పెరుగు వేసి వండుతున్నారా?

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ తింటుంటారు. కొంత మంది చికెన ఫ్రై, మరికొంత మంది చికెన్ బిర్యానీ చేసుకొని తింటుంటారు.


ఇక మంచి టేస్ట్, కర్రీ చిక్కగా, చాలా టేస్టీగా ఉండటం కోసం కొందరు పెరుగు కలుపుతుంటారు. అయితే ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరే ప్రమాదం ఉన్నదంట.

పెరుగు చల్లటి, పుల్లటి స్వభావం కలిగి ఉంటుంది. చికెన్ వేడి స్వభావంతో ఉంటుంది. అందువలన ఈ రెండింటి కలిపి తినడం వలన కడుపు సమస్యలు వస్తాయంట. ముఖ్యంగా అజీర్ణం, కడుపు నొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదంట.

అంతే కాకుండా పెరుగులో ఉండే యాసిడ్స్, చికెన్‌లో ఉండే ప్రోటీన్‌తో కలవడం, అలాడే, చికెన్, పెరుగు కలిపి తినడం వలన కొంత మందికి విరేచనాల వంటి సమస్యలు, ఆహారం తినాలనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురు అవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ కాంబినేషన్ తినడం చాలా ప్రమాదకరం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఇవే కాకుండా చర్మ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదంట. చర్మంపై దుద్దర్లు, దురద, అలెర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా కొంత మందిలో ఇది అధిక బరువు, వాతానికి కూడా కారణం అవుతుంది. అందువలన వీలైనంత వరకు చికెన్‌లో పెరుగు వేయకపోవడమే మంచిదంట.

ఒక వేళ మీరు చికెన్‌లో పెరుగు వేసి వండాలి? ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా చికెన్‌లో పెరుగు వేయాలి అనుకుంటే అది ఎక్కువ పుల్లగా లేకుండా చూసుకోవాలి. అలాగే మ్యారినేషన్ చాలా తక్కువ సేపు చేయాలంట.

నోట్ : పై వార్త కేవలం ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగినది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.