జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ ముఖ్యమైన ఆదేశాలు

www.mannamweb.com


జనసేన పార్టీ (Janasena Party) కేంద్ర కార్యాలయంలో రేపు (ఆగస్టు 1) నుంచి అర్జీలు స్వీకరణ కార్యక్రమం దృష్ట్యా ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగస్టు 1 నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు, సూచనలు స్వీకరించాలని ఆదేశాలిచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మల్యేలు ప్రతి నెలా కనీసం రెండు రోజులపాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

Home » Andhra Pradesh » Applications will be accepted from August 1 in the central office of the Janasena Party says Deputy CM Pawan Kalyan psnr

Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ ముఖ్యమైన ఆదేశాలు

ABN , Publish Date – Jul 31 , 2024 | 08:27 PM

జనసేన పార్టీ (Janasena Party) కేంద్ర కార్యాలయంలో రేపు (ఆగస్టు 1) నుంచి అర్జీలు స్వీకరణ కార్యక్రమం దృష్ట్యా ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు.
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ ముఖ్యమైన ఆదేశాలు
Pawan Kalyan

అమరావతి: జనసేన పార్టీ (Janasena Party) కేంద్ర కార్యాలయంలో రేపు (ఆగస్టు 1) నుంచి అర్జీలు స్వీకరణ కార్యక్రమం దృష్ట్యా ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగస్టు 1 నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు, సూచనలు స్వీకరించాలని ఆదేశాలిచ్చారు. పార్టీ ఎంపీలు, ఎమ్మల్యేలు ప్రతి నెలా కనీసం రెండు రోజులపాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ప్రజలు చెప్పే సమస్యలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించాలని సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆగష్టు 1 నుంచి సెప్టెంబరు 11 వరకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల‌ వివరాలను జనసేన పార్టీ ప్రకటించింది.

యుఎస్ కాన్సుల్ జనరల్‌కు పవన్ కృతజ్ఞతలు

నిన్న (మంగళవారం) తనతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెనిఫర్ లార్సన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతిపై కేంద్రీకృతమై ఇటువంటి నిర్మాణాత్మక చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ‘‘మీ భాగస్వామ్యంతో యువతలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో చాలా కీలకమైనది. ఆంధ్రప్రదేశ్ అంతటా స్థిరమైన అభివృద్ధిని పెంపొందించేందుకు మీరు సహకారం ఇస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కాగా మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో అయిన యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిపర్ లార్స్ న్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాల‌పై వీరి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని వారిని పవన్ కళ్యాణ్ కోరారు.