ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక విద్యార్థుల దృష్టి పూర్తిగా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలపై ఉంటుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్ రెండో సెషన్ కూడా ముగింపు దశలో ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు రాసే ముఖ్యమైన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షల వివరాలు ఇవే:
1. JEE మెయిన్ పేపర్-1
- లక్ష్యం: NIT, IIIT, CFTI తదితర ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో BE/B.Tech ప్రవేశాల కోసం.
- వెబ్‌సైట్: jeemain.nta.nic.in
2. JEE అడ్వాన్స్‌డ్
- లక్ష్యం: IITల్లో Bachelor, Integrated Masters, Dual Degree కోర్సులకు.
- నోటు: JEE మెయిన్‌లో అర్హత సాధించినవారే రాయగలరు.
- వెబ్‌సైట్: jeeadv.ac.in
3. BITS అడ్మిషన్ టెస్ట్ (BITSAT)
- లక్ష్యం: బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – పిలానీ, గోవా, హైదరాబాద్, దుబాయ్ క్యాంపస్‌ల్లో ప్రవేశం.
- చివరి తేదీ: 2025 ఏప్రిల్ 18
- వెబ్‌సైట్: bitsadmission.com
4. TS EAPCET
- లక్ష్యం: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీలకు.
- చివరి తేదీ: 2025 ఏప్రిల్ 9 (రూ.250/- ఆలస్య రుసుముతో)
విద్యార్థులు 2025 ఏప్రిల్ 24 వరకు ఐదువేల రూపాయల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేయవచ్చు. - వెబ్‌సైట్: eapcet.tsche.ac.in
5. AP EAPCET
- లక్ష్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీలకు.
- చివరి తేదీ: 2025 ఏప్రిల్ 24
- వెబ్‌సైట్: cets.apsche.ap.gov.in
6. VITEEE
- లక్ష్యం: VIT (వెల్లూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్, భోపాల్) క్యాంపస్‌లలో ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశం.
- చివరి తేదీ: 2025 ఏప్రిల్ 7
- వెబ్‌సైట్: viteee.vit.ac.in
7. SRMJEEE
- లక్ష్యం: SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్‌లలో ప్రవేశం.
- చివరి తేదీ: 2025 ఏప్రిల్ 16
- వెబ్‌సైట్: srmist.edu.in
8. SET (Symbiosis EntranchtmlTest)
- లక్ష్యం: సింబయాసిస్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం.
- చివరి తేదీ: 2025 ఏప్రిల్ 12
- వెబ్‌సైట్: settest.org/register.html”