ఆ ఆలయం లో నిద్రిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. అమ్మ అనే పిలుపు సొంతం అవుతుంది. ఎంతో మందికి ఇప్పుడు ఆ ఆలయంకు పోటెత్తుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వంటి కొన్ని విశిష్ట రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు లేని ఆలుమగలు ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
పూజలు చేసిన భార్యాభర్తలు తిరిగి సంవత్సర కాలంలో పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించటం ఇక్కడ సర్వ సాధారణం గా కనిపిస్తోంది. ఇంత విశేషం ఉన్న ఆలయం కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
తల్లి కావాలని ఎదురుచూసి.. అలసిన మహిళలకు ఆ ఆలయం ఒక వరంలా మారింది. ఈ ఆలయం పైన ఎంతో నమ్మకం ఏర్పడింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వంటి కొన్ని విశిష్ట రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు లేని ఆలుమగలు ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక్కడ సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేసిన వారుతిరిగి సంవత్సర కాలంలో పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లిస్తారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పాములు మల్లవరంగా పిలిచే ఏకే మల్లవరం గ్రామంలో ఉన్న ఈ ప్రాచీన ఆలయానికి ఈ మధ్య కాలంలో విశేష ప్రాచుర్యం పెరిగింది. ఇక్కడ ఆలయం లోనూ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి.
ఆలయంలో ఒక నాగుపాము నిత్యం శివలింగం వద్దకు వచ్చి ఉంటుందని, భక్తులు పూజలు చేసినా కదలదని చెబుతారు. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి, షష్ఠి మంగళవారం కలిసిన రోజుల్లో, మాసశివరాత్రి రోజున విశేష పూజలు జరుగుతాయి. స్కంద షష్ఠి, ఆడికృత్తిక, నాగ పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం లో భక్తులు సర్ప దోష పూజలను ఎక్కువగా నిర్వహిస్తారు. సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో ప్రత్యేకంగా దోష నివారణ పూజలు నిర్వహిస్తుంటారు.. దానితో ఇక్కడకు విచ్చేసిన దంపతులకు పిల్లలను అనుగ్రహించే స్వామిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ పూజలు అందుకుంటారు.
ఈ ఆలయానికి విచ్చేసిన సంతానం లేని మహిళలు నాగులు చీర, ధరించి గర్భగుడి వెనకాల ఉన్న శయన మందిరంలో గంటసేపు నిద్రిస్తారు. తరువాత దంపతులు ఇరువురు కలిసి ఆలయంలో జరుగు అభిషేకాలలో పాల్గొని దోష నివారణ పూజలు చేస్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టికి, మాస శివరాత్రికి షష్టి మంగళవారం కలిసి వచ్చిన రోజుల్లో ఈ ఆలయానికి విపరీతమైన భక్తజనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో నిద్రించేందుకు టోకెన్లు తీసుకొని మరి మహిళలు వేచి ఉంటారు. అయితే, ఎతో నమ్మకంతో ఇక్కడ నిద్ర చేసిన వారు తరువాతి రోజుల్లో తమ పిల్లలతో కలిసి ఆలయం సందర్శించుకొని ముక్కులు చెల్లిస్తున్నారు. దీంతో, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.






























