ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు ప్రతిరోజూ ఉదయం ఈ ఐదు పనులు చేయండి

చాలా సార్లు కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అదే సమయంలో ఇంటి ప్రతికూల శక్తి కూడా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.


అనేక సమయాల్లో మనం తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తాము.

ఇది ప్రతికూల శక్తి ప్రసారాన్ని పెంచుతుంది. నెగటివ్ ఎనర్జీని నియంత్రించేందుకు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటి సహాయంతో మీరు మీ ఇంటి సానుకూల శక్తిని పెంచుకోవడమే కాకుండా మీ ఆర్థిక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. డబ్బు సమస్యలను అధిగమించేందుకు పాటించాల్సిన కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం. ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుండానే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టవచ్చు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

అరటి చెట్టు ఆరాధన

శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి మీరు ప్రతి గురువారం అరటి చెట్టును పూజించాలి. అదే సమయంలో వీలైతే రోజూ ఉదయాన్నే అరటిచెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీనివల్ల ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చు. అలాగే విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు కొరత ఉండదు.

ఉప్పు

కొన్నిసార్లు ఇంట్లో ప్రతికూల శక్తి కూడా మీ ఆర్థిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కావున నీళ్లలో ఉప్పును కలిపి ఇంటిని తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. అలాగే ఇంటి మూలలో ఉప్పు పెట్టి దిష్టి తీయవచ్చు. ఆ ఉప్పును బయట పారేయకుండా సింక్ లో వేసి నీళ్ళలో కలిపేయాలి.

దీపం వెలిగించండి

ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. తద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో పూజలు సక్రమంగా చేస్తే జీవితంలో దుఃఖాలు, ధన సమస్యలు తొలగిపోతాయి. దీప ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెప్తారు.

తులసి పూజ

ప్రతిరోజూ తులసికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఉదయం, సాయంత్రం తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మాతను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అదే సమయంలో శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం, లక్ష్మీ సూక్తం పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి

ఇంటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది ఇంటి పరిసరాలను శుద్ధి చేయడంతోపాటు పాజిటివ్ ఎనర్జీని కూడా పెంచుతుంది. అదే సమయంలో అనవసరమైన వస్తువులను సేకరించవద్దు. ఈ రోజు ఇంటి నుండి వ్యర్థాలను బయటకు తీయండి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం అలవాటుగా భావించాలి.

సూర్యునికి నీరు సమర్పించడం

సూర్యునికి రోజూ నీరు సమర్పించడం వల్ల జాతకంలో సూర్యగ్రహ స్థానం బలపడుతుంది. సూర్య గ్రహం గౌరవం, ప్రతిష్టకు సంబంధించినదిగా పరిగణిస్తారు. మతపరంగా సూర్యుడి శుభ దృష్టి కెరీర్‌లో విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించగలదు. అందుకే ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ సూర్య బీజ మంత్రాలు పఠించాలి.