ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ప్రైమ్ సేల్ ప్రారంభమైంది. జులై 12 నుండి 14 వరకు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, హోం నీడ్స్…ఇలా ఎన్నో ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
అయితే అమెజాన్ సేల్‌తో పాటు ఫ్లిప్ కార్ట్ (Flip Cart)లోనూ భారీ డిస్కౌంట్లతో సేల్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ సేల్ గురించి తెలుసుకుందాం!
ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ (Goat Sale)ను ప్రారంభించింది. ఈ సేల్‌లో అనేక రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి.
ఎప్పటి నుండి ప్రారంభం !
ఫ్లిప్ కార్ట్…యెక్క గోట్ సేల్ ( Goat Sale ) జులై 12 నుండి 17 వరకు అందుబాటులో ఉంటుంది. మొత్తం వారం రోజుల పాటు ఈ సేల్ జరుగుతుంది.
ఫ్లిప్ కార్ట్ సేల్ కోసం మెంబర్షిప్ కావాలా?
అమెజాన్ ప్రైమ్ సేల్…కేవలం ప్రైమ్ సబ్స్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ (Goat Sale) కోసం ఎలాంటి మెంబరిషిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికి అందబాటులో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు మాత్రం కాస్త ముందుగానే ఈ సేల్ ప్రారంభమవుతుంది.
గోట్ సేల్‌లో డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లు ఇవే!
గోట్ సేల్( Goat Sale)లో భాగంగా ఫ్లిప్ కార్ట్… యాక్సెస్ బ్యాంక్,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరియు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌తో కస్టమర్లకు ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్స్‌పై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది.
ఐఫోన్ 16 మరియు శ్యామ్‌సంగ్ గెలాక్సీ S24 మోటరోలా ఎడ్జ్ 60 ప్రో వంటి స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. వీటితో పాటు Nothing మరియు CMF ఎలక్ట్రానికి డివైజెస్‌పై GOAT Saleలో డిస్కౌంట్లు ప్రకటించారు.
ఫ్లిప్‌కార్ట్‌లో గోట్ సేల్‌లో సెలెక్టెడ్ గృహోపకరణ వస్తువులపై 85శాతం వరకు తగ్గింపు ప్రకటించారు. ఈ కేటగిరీ కింద, గృహోపకరణాలతో పాటు మరిన్ని వస్తువులపై డిస్కౌంట్స్ లభిస్తాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ జరుగుతున్న సమయంలో పలు రకాల సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో నకిలీ మేసెజెలు, ఇమెయిల్‌లు మొదలైన వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు లేదా సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయచ్చు, కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer:
పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం ఫ్లిప్ కార్ట్(Flipkart) అధికారిక వెబ్సైట్ సందర్శించండి
































