బెల్లం టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

మనలో ప్రతి ఒక్కరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ మనం చక్కెరతో చేసిన టీనే తాగుతుంటాం. కానీ చక్కెరకు బదులుగా బెల్లంతో తయారుచేసిన టీ తాగితేనే మంచిది. ఎలాగో తెలుసుకుందాం పదండి.

బెల్లం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

ప్రతి ఒక్కరూ టీని చక్కెరతోనే తయారుచేస్తుంటారు. కానీ చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువును పెంచడమే కాకుండా.. బ్లడ్ షుగర్ ను కూడా పెంచుతుంది. అందుకే చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని అంటుంటారు. అందుకే చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినాలని చెప్తుంటారు. అయితే టీని బెల్లంతో కూడా తయారుచేయొచ్చు. నిజానికి బెల్లంతో చేసిన టీ ఆరోగ్యానికి చా


లా మంచిది. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అసలు బెల్లం టీని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఐరన్ పుష్కలంగా ఉంటుంది

బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇది ఊపిరితిత్తుల నుంచి మన శరీరమంతా ఆక్సిజన్ ను రవాణా చేయడానికి ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి అవసరం. రోజూ బెల్లాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ఐరన్ అందుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్న బెల్లం టీ తాగినా బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డు తిన్నా రక్తం పెరుగుతుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది

బెల్లం జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి పోషకాలు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు బెల్లంలోని వేడి చేసే లక్షణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే ఇవి జీవక్రియను పెంచేందుకు కూడా సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా బెల్లం సహాయపడుతుందని కొందరు నమ్ముతారు. జీర్ణ సమస్యలు లేదా మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు బెల్లం టీ లేదా బెల్లం వాటర్ ను తాగితే మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.

దగ్గు, జలుబు తగ్గుతుంది

బెల్లం టీ దగ్గు, జలుబును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీనిలోని వేడి చేసే లక్షణాలు జలుబును తొందరగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ టీని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అందుకే దగ్గు, జలుబు ఉన్నప్పుడు బెల్లం టీని తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

చక్కెర బరువును పెంచుతుంది. కానీ బెల్లం బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచేందుకు సహాయపడతాయి.

ఇది నేచురల్ స్వీట్ కాబట్టి ఇది మీరు అనవసరంగా చిరుతిండి తినకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇది ఆకలి కోరికలను తగ్గిస్తుంది. మీరు గనుక బెల్లం టీని తాగితే ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినకుండా ఉంటారు.

క్లెన్సింగ్ ఏజెంట్

బెల్లం టీని తాగితే మీ శరీరంలో ఉన్న విష పదార్థాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం టీ తాగితే మన శరీరంలోని వివిధ అవయవాల నుంచి విషాలు తొలగిపోతాయి. దీంతో మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. బెల్లం టీలో యాంటీ ఆక్సెండ్లు, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బెల్లం టీ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. మీరు హెవీగా తిన్న తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే కప్పు వేడి వేడి బెల్లం టీని తాగండి. వెంటనే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

బెల్లం టీని తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇది పేగు కదలికలను మెరుగుపర్చి జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు బెల్లం టీ తాగితే మీ శరీరంలో ఫ్రీరాడికల్స్ సంఖ్య తగ్గుతుంది. ఈ ఫ్రీరాడికల్స్ కణాలను నాశనం చేసి మనల్ని జబ్బుల బారిన పడేస్తాయి. అయితే మీరు బెల్లం టీ తాగితే ఈ ముప్పు తగ్గుతుంది. ఈ టీలో జింక్, సెలీనియలు ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు సహాయపడతాయి. దీంతో మనం ఇన్ఫెక్షన్లకు, ఇతర జబ్బులకు దూరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో శక్తి పెరుగుతుంది

బెల్లంలో కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బెల్లం టీని తాగితే శరీరంలో వెంటనే శక్తి పెరుగుతుంది. రోజూ ఒక బెల్లం టీ తాగితే మీరు అలసిపోకుండా ఎనర్జిటిక్ గా ఉంటారు. మీకు ఉదయం లేదా సాయంత్రం పూట అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లం టీ తాగండి. ఎనర్జిటిక్ గా అవుతారు.

గుండె ఆరోగ్యం

బెల్లం టీ మన గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే బెల్లం లో ఉండే పొటాషియం కంటెంట్ అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.