మీ గదికి నప్పే ఏసీ ఏమిటో తెలుసా.?అమెజాన్‌లో ఏసీలపై బంపర్ ఆఫర్లు

ఇటీవల కాలంలో ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) వాడకం బాగా పెరిగింది. మధ్య తరగతి కుటుంబాలు సైతం వీటిని వినియోగిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులు, పెరిగిన జనాభా, నగరంలో ట్రాఫిక్ తదితర కారణాలతో చల్లని గాలి లభించడం లేదు. దీంతో చక్కని నిద్ర కోసం ఏసీలను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వాడడం వల్ల విద్యుత్ బిల్లు బాగా ఎక్కువ వస్తుందనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ అది నిజం కాదు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, గదిలో చక్కని చల్లదనం అందించే టెక్నాలజీతో అనేక ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. ముందుగా మీ గదికి నప్పే ఏసీని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. సుమారు 111 నుంచి 150 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన గదులకు 1.5 టన్ ఏసీలు సరిపోతాయి. అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఆ ఏసీలు, వాటి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ విద్యుత్ వినియోగంతో చక్కని చల్లదనం అందించే ఏసీలలో క్యారియల్ 1.5 టన్ 3 స్టార్ వైఫై స్మార్ట్ ఫ్లెక్సీ కూల్ ఇన్వర్టర్ ఏసీ ముందుంటుంది. దీనిలోని ఆరు సర్దుబాటు మోడ్ లతో కాలానికి అనుగుణంగా ఏసీని వాడుకోవచ్చు. దాని వల్ల తక్కువ విద్యుత్ వినియోగంతో అవసరమైన చల్లదనం పొందే వీలుంటుంది. ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్ కంప్రెసర్, యాంటీ కిరోసివ్ ఫీచర్ కలిగిన కండెన్సర్ కాయిల్స్, అంతర్నిర్మిత వోల్టేజీ రక్షణ సర్ట్ లు, 4 ఫ్యాన్ స్పీడ్ తదితర ప్రత్యేకతలు ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్ లో రూ.35,989కు ఈ ఏసీని అందుబాటులో ఉంది.


అన్ని కాలాలకు అనువుగా ఉండే ఏసీని కొనుగోలు చేయాలనుకునే వారికి హైయర్ 1.5 టన్ 3 స్టార్ ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ బాగుంటుంది. దీనిలోని ఏడు కన్వర్టిబుల్ మోడ్ లతో కాలానికి అనుగుణంగా చల్లదనాన్ని సెట్ చేసుకోవచ్చు. ట్విన్ ఇన్వర్టర్ కంప్రెసర్ తో నడిచే ఈ ఏసీ 54 డిగ్రీల ఎండ సమయంలో కూడా చక్కగా పనిచేస్తుంది. సెల్ఫ్ క్లీన్ ఫీచర్, చక్కని ఎయిర్ త్రో, రాగి కండెన్సర్, 42 డీబీ శబ్దస్థాయి, 965 కేడబ్ల్యూహెచ్ వార్షిక వినియోగం కలిగిన ఈ ఏసీని అమెజాన్ లో రూ.34,990కి అందుబాటులో ఉంచారు.

అత్యుత్తమ పనితీరు కనబరిచే ఏసీలలో ఎల్ జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఒకటి. దీనిలోని విరాట్ మోడ్ తో వేగవంతమైన చల్లదనం పొందవచ్చు. దీనిలో ఆరు కన్వర్టిబుల్ మోడ్ లు ఉన్నాయి. వాటిలోని ఏఐ మోడ్ ద్వారా గదిలోని వేడిని గుర్తించి, దానికి అనుగుణంగా చల్లదనాన్ని సెట్ చేస్తుంది. ఎక్కువ దూరం వీచే ఎయిర్ త్రో, రాగి కండెన్సర్ కాయిల్, బ్లాక్ ఓషన్ టెక్నాలజీ, ఏసీ జీవితకాలం పెంచేలా గోల్డ్ ఫిన్ ప్లస్ పూత, యాంటీ వైరస్, హెచ్ డీ ఫిల్టర్ దీని ప్రత్యేకతలు, సుమారు 111 నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణం గల గదులకు సరిపోతుంది. అమెజాన్ లో దీని ధర రూ.45,490.

తక్కువ నిర్వహణ వ్యయంతో చక్కని చల్లదనం అందించడం లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ప్రత్యేకత. తక్కువ శబ్దంతో పాటు కంటిపై కాంతి పడుకుండా హాయిగా పనిచేస్తుంది. ఫిల్టర్ ను శుభ్రం చేయాల్సి వచ్చినప్పుడు హెచ్చరిక చూపిస్తుంది. బ్లూఫిన్స్ ఆవిరిపోరేటర్ తో ఏసీకి తుప్పు పట్టదు. ఆధునిక ఇళ్లకు సరిపోయే డిజైన్, త్వరిత శీతలీకరణ కోసం టర్బో కూల్, పీఎం 2.5 ఫిల్టర్ తో మెరుగైన వడపోత, ఏడాదికి 956.79 కిలోవాట్ గంటల శక్తి వినియోగం దీని ప్రత్యేకతలు. ఈ ఏసీని అమెజాన్ లో రూ.34,490కి కొనుగోలు చేయవచ్చు.

ప్రముఖ బ్రాండ్ వోల్టాస్ నుంచి విడుదలైన 1.5 టన్ త్రీ స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ సుమారు 111 నుంచి 150 చదరపు అడుగుల గదికి చక్కగా సరిపోతుంది. గదిలో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా చల్లదనాన్ని సర్దుబాటు చేసుకోవడానికి నాలుగు మోడ్ లు ఏర్పాటు చేశారు. దీని వల్ల అదనపు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. రిమోట్ ద్వారా ఏసీని నియంత్రణ చేయవచ్చు. సుమారు 52 డిగ్రీల వేడిలో కూాడా ఇంటికి చల్లదనం అందిస్తుంది. యాంటీ డస్ట్ ఫిల్టర్, రాగి కండెన్సర్ కాయిల్స్, 38 డీబీ శబ్దస్థాయి, ఏడాదికి సుమారు 975.26 కేడబ్ల్యూహెచ్ శక్తి వినియోగం దీని ప్రత్యేకతలు. ఈ ఏసీని అమెజాన్ లో రూ.33,990కి కొనుగోలు చేయవచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.