ఆయుష్మాన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకున్నారా? లేదంటే.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం కింద అర్హులైన వారికి లక్షల రూపాయల విలువైన ఉచిత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది.
ఇప్పటివరకు, 30 కోట్లకు పైగా పౌరులు ఆయుష్మాన్ కార్డులను పొందారు. మీరు కూడా ఈ పథకం నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇదే సరైన సమయం. మీరు ఆయుష్మాన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎక్కడికీ వెళ్లకుండా మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి ఇంటి నుంచి సులభంగా అప్లయ్ చేసుకోవచ్చు.
ఆయుష్మాన్ కార్డు ప్రయోజనాలివే :
కేంద్ర ప్రభుత్వం 2018లో పేదల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తుంది. లబ్ధిదారులు ప్రతి సంవత్సరం రూ. 5 లక్షల విలువైన ఉచిత వైద్య చికిత్సను పొందుతారు. ఈ కార్డు ప్రతి ఏటా అప్‌డేట్ అవుతుంది.
మీరు ప్రతి సంవత్సరం ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఆయుష్మాన్ కార్డుతో మీరు పథకంలో భాగమైన అనేక ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు. అవసరమైన వారికి ఆరోగ్య సేవలను అందించడమే ఈ పథకం లక్ష్యం. మీరు ఈ ప్రయోజనాలను పొందాలనుకుంటే.. మీరు ఆయుష్మాన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆయుష్మాన్ కార్డుకు అర్హతలివే :
మీకు ఈ అర్హతలు ఉంటే ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు భారత్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి.
ఈ పథకం ప్రయోజనాలు BPL (దారిద్య్రరేఖకు దిగువన) లేదా ఆర్థికంగా బలహీన వర్గాల పౌరులకు వర్తిస్తాయి.
సామాజిక-ఆర్థిక, కుల గణనలో చేర్చిన కుటుంబాలు అర్హులు.
మీరు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైతే దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు :
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
మొబైల్ నంబర్
బ్యాంక్ పాస్‌బుక్
పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్
మొబైల్ ద్వారా ఆయుష్మాన్ కార్డు కోసం ఎలా అప్లయ్ చేయాలంటే? :
అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
అధికారిక ఆయుష్మాన్ భారత్ వెబ్‌సైట్‌కి వెళ్లి ‘Beneficiary Login’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
మొబైల్ వెరిఫికేషన్ చేయండి.
మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
మీకు పంపిన OTPని ఎంటర్ చేయడం ద్వారా వెరిఫై చేయండి.
E-KYC పూర్తి చేయండి
E-KYC ఆప్షన్ క్లిక్ చేసి, అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
ఆ సభ్యుడిని ఎంచుకోండి
ఆయుష్మాన్ కార్డ్ ఎవరి కోసం జనరేట్ చేయాలో ఎంచుకోండి.
E-KYC ఐకాన్ మళ్ళీ క్లిక్ చేయండి. ఆపై లైవ్ ఫోటో లేదా అప్‌లోడ్ చేసేందుకు కెమెరా ఐకాన్ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారమ్ నింపండి
దరఖాస్తు ఫారంలో అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయండి.
దరఖాస్తును సమర్పించండి.
మీ దరఖాస్తు పూర్తి చేసేందుకు (Submit) బటన్‌పై క్లిక్ చేయండి.
అన్నీ సరిగ్గా ఉంటే.. మీ ఆయుష్మాన్ కార్డ్ 24 గంటల్లోపు అప్రూవల్ వస్తుంది. ఆ తర్వాత మీరు మీ మొబైల్ ఫోన్‌లో కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.