తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రారంభంలో చిన్న చిన్న సహాయక పాత్రలు చేసి, తర్వాత ప్రతినాయక పాత్రలు పోషించారు చిరంజీవి. తర్వాత నెమ్మదిగా తన డ్యాన్సులు, ఫైట్లతో హీరోగా మారి అభిమానులను అలరించారు.
ఈ క్రమంలో సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఆవిర్భవించారు. సుమారు నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. కొంచెం డబ్బులు సంపాదించిన తర్వాత చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో సమాజానికి సేవ చేయడం ప్రారంభించారు. బ్లడ్ బ్యాంకును, ఐ బ్యాంకును ఏర్పాటు చేశారు. తన కెరీర్ లో చిరంజీవి ఆస్తులు ప్రస్తుతం వేల కోట్లరూపాయలకు చేరుకున్నాయి.
ఎప్పుడూ తన పరిధిని దాటలేదు
అంత కూడబెట్టినా ఏనాడూ తన పరిధిని దాటి వ్యవహరించలేదు. రూపాయి ఖర్చుచేయాలంటే ఎంతో జాగ్రత్తగా ఆచితూచి ఖర్చుచేస్తారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వ్యక్తి కావడంతో తనతోపాటు కుటుంబ సభ్యులందరికీ అలాగే అలవాటు చేశారు. అయితే వారంతా ఎక్కడికైనా విహార యాత్రలకు వెళ్లాలన్నా, మరేదైనా పార్టీలు చేసుకోవాలనుకుంటే మాత్రం ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చేవారు. అయితే ఒక్కదానికి మాత్రం రూపాయి కూడా ఇచ్చేవారు కాదు. నిర్మొహమాటంగా లేదని చెప్పేవారు. అది ఏ పార్టీ అంటే మందు పార్టీ. మందు పార్టీలు చేసుకోవడం అనేది చాలా చెడు అలవాటని, దానికి అలవాటు పడొద్దని పదే పదే హితవు పలికేవారు. ఒక్కసారి మందు తీసుకున్నా అది క్రమశిక్షణ తప్పినట్లవుతుందని, అందుకే తాను దానికి వ్యతిరేకమని స్పష్టంగా చెప్పేవారు.
నాగబాబు, పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లేవారు
అయితే చిరంజీవి డబ్బులివ్వడంలేదుకదా అని వారంతా నాగబాబు దగ్గరకు, పవన్ కల్యాణ్ దగ్గరకు వచ్చేవారు. వారు కూడా చిరంజీవి బాటలోనే పయనిస్తున్నవారు కావడంతో అక్కడకూడా వీరికి చుక్కెదురయ్యేది. స్నేహితులతో సరదాగా చేసుకునే పార్టీలకు, ఇంట్లో జరిగే పార్టీలకైతే డబ్బులిస్తాంకానీ మందుపార్టీలకు ఎట్టి పరిస్థితుల్లోను ఇచ్చేదిలేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేవారు. రూపాయి కూడా ఇచ్చేదిలేదని నిర్మొహమాటంగా చెప్పడంతో వారంతా నిరాశపడేవారు. అయితే మనం మంచిబాటలో నడుస్తుండటంతోపాటు కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా అదేబాటలో నడవాలని మీరంతా స్ఫూర్తివంతంగా నడవాలని, మీరు నడవడంతోపాటు ఇతరులు కూడా నడిచేలా చూడాలని వారంతా వీరికి హితవు చెప్పేవారు. అందుకే వారికి మందు పార్టీలకు మాత్రం చిరంజీవి నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పడుంటే అందరూ హీరోలై ఎవరికివారు సంపాదించుకుంటూ, పార్టీలంటూ ఎంజాయ్ చేస్తున్నారు.