DOST 2025 – డిగ్రీ అడ్మిషన్లకు త్వరలో దోస్త్ నోటిఫికేషన్.

DOST 2025 నోటిఫికేషన్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం త్వరలోనే DOST 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.


DOST 2025 నోటిఫికేషన్
డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో ఆన్‌లైన్ DOST పద్ధతిని ఈ సంవత్సరం రద్దు చేయాలనే నిర్ణయాన్ని ఉన్నత విద్యా మండలి ఉపసంహరించుకుంది. దీనితో ఈ సంవత్సరం కూడా DOST ద్వారానే అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

DOST 2025 అడ్మిషన్ ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేయాలని మండలి తెలిపింది.

జూన్ 16 నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు ప్రారంభించే లక్ష్యంతో, DOST నోటిఫికేషన్ 2025ని త్వరలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 4.6 లక్షల సీట్లు ఉన్నప్పటికీ, కేవలం 2.25 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చేరుతున్నారు. ఈ పరిస్థితిలో, జీరో అడ్మిషన్లు నమోదయ్యే కళాశాలలు మరియు కోర్సులకు అనుమతి ఇవ్వకూడదని ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీలకు సూచించింది.