జుట్టు రాలడం, రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు పెరగకపోవడం.. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న జుట్టు సమస్యల్ల ప్రధానమైనది. అయితే ఈ సమస్యల నుంచి బయటపడే మార్గం మాత్రం చాలా మందికి తెలియదు. చాలా మంది జుట్టు సమస్యలు అంటే.. షాంపూ, కండీషనర్, ఆయిల్ వంటి వాటితో పరిష్కారం దొరుకుతుందని అనుకుంటారు. నిజానికి.. కొన్నిసార్లు జుట్టు సమస్యలను ఆహారం ద్వారా కూడా నివారించవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల జ్యూస్‌లు తాగితే ఈ సమస్యలన్నీ ఇట్టే మాయం అవుతాయని అంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకు ఉదయం నిద్ర లేవగానే ఈ కింది డ్రింక్స్ తాగాలట. అవేంటో తెలుసుకుందాం..
డాబర్ వాటర్ – ఉసిరి డ్రింక్
కొత్త జుట్టు రాకపోయినా, జుట్టు సరిగ్గా పెరగకపోయినా డాబర్ వాటర్ సహాయం తీసుకోవాలి. నారింజ రసం, ఉసిరి రసం, బీట్‌రూట్ రసం, చియా గింజలను కొబ్బరి నీళ్లలో కలపాలి. ఈ పానీయం వారానికి 3 నుంచి 4 రోజులు తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఈ పానీయం జుట్టు ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది.
సోపు – తులసి ఆకు నీరు
సోపు – తులసి ఆకుతో తయారు చేసిన డ్రింక్ జుట్టుకు పోషణను అందిస్తుంది. ఒక చెంచా సోంపు గింజలను గ్లాసుడు నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం అందులో తులసి ఆకుల రసాన్ని కలుపుకుని తాగాలి. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
బాదం స్మూతీ
చియా గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు, తామర గింజలను తేలిక పాడి సెగపై వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. బాదం, ఖర్జూరాలను నీటిలో నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన బాదం, ఖర్జూరం నీళ్లలో గింజల పొడిని కలిపి స్మూతీ తయారు చేసుకుని తాగొచ్చు. ఇది జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
పెప్పర్‌మింట్ టీ
జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో పెప్పర్‌మింట్ టీ ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్‌ను బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షిస్తాయి. ఇది కొత్త జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది.
అలోవెరా జ్యూస్
చర్మ సమస్యలే కాకుండా అలోవెరా జ్యూస్ జుట్టు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అమైనో ఆమ్లాలు, కెరాటిన్ వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ డ్రింక్ జుట్టు సమస్యలను చిటికెలో నివారిస్తుంది. ఈ డ్రింక్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, జుట్టు నెరవడం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.