జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది. ప్రతి ఉదయం నీటిలో నానబెట్టిన రెండు వాల్‌నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. మెదడు కంప్యూటర్ లా వేగంగా పనిచేయాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ జీవనవిధానంలో చిన్న మార్పు చేయండని నిపుణుల అంటున్నారు. ప్రతి ఉదయం నీటిలో నానబెట్టిన రెండు వాల్‌నట్స్ తింటే మెదడు సామర్థ్యాన్ని పెరుగుతుందట. అంతేకాదు వాల్‌నట్స్‌లో ఉండే పోషకాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలో వెల్లడైంది. ఇది జ్ఞాపకశక్తిని పదును పెట్టడమే కాకుండా, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయట. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు క్రమంగా క్షీణిస్తుంది. ఫలితంగా పని చేస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఇబ్బంది కలగుతుంది. తరచూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్న వారికి కూడా వాల్‌నట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మానసిక ప్రశాంతతను అందిస్తాయి.
Also Read
Education
More