EC Notics To AP CM Jagan: ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా సీఎం జగన్ మోహన్ రెడ్డికి నోటీసు ఇచ్చారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభా ప్రసంగాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య సీఈఓకు కంప్లైంట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఆయన కంప్లైంట్‌లో పేర్కొన్నారు.
వర్ల రామయ్య కంప్లైంట్‌పూ స్పందించిన సీఈఓ ముకేశ్ కుమార్ మీనా జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. వీటిపై స్పందించకపోతే ఈసీ చర్యలు అనివార్యం అని పేర్కొన్నారు. ఇక నోటీసుపై సీఎం జగన్ ఎలా స్పందిదస్తారో వేచి చూడాలి.
కాగా పెన్షన్లను చంద్రబాబు అడ్డుకున్నారని.. 31 మంది వృద్ధుల మృతి కారణమయ్యారని బాబుపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సాడిస్ట్ అని పేర్కొన్నారు. మదనపల్లి, పూతలపట్టులో జగన్ చంద్రబాబును పసుపతి అంటూ సంభోదించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. జగన్ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించాయని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీఈఓ.. ఆదివారం సీఎం జగన్‌కు నోటీసు జారీ చేసింది.