విద్యార్థులకు అదిరిపోయే వార్త.. ‘తల్లికి వందనం’ స్కీమ్‌కు అర్హులు వీళ్లే.
Ammaku Vandanam Scheme 2024 Eligibility: ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుడుతోంది. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఇచ్చిన పథకాన్ని..
ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం పేరుతో అంజేయనున్నారు. ఈ స్కీమ్ కింద వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక విద్యార్థికి రూ.15 వేలు అందజేయగా.. కొత్త ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే ఒక్కొక్కరికి రూ.15 వేలు అందజేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఇచ్చింది. ఈ మేరకు ‘తల్లికి వందనం’, ‘స్టూడెంట్ కిట్’ సంక్షేప పథకాలను ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.
‘తల్లికి వందనం’, ‘స్టూడెంట్ కిట్’ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆధార్ లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆధార్ కార్డు వచ్చే పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దారిద్య రేఖకు దిగువన ఉండి.. పాఠశాలలకు పిల్లలను పంపించే తల్లలు లేదా సంరక్షలు బ్యాంక్ ఖాతాలోకి రూ.15 వేలు జమకానుంది. ఈ పథకం లబ్ధి చేకూరాలంటే విద్యార్థులకు తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలని స్పష్టం చేసింది.
ఇక స్టూడెంట్ కిట్ స్కీమ్ కింద ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, ఇంగ్లీష్ డిక్షనరీ, బ్యాగ్, బెల్టు, 3 జతల దుస్తులు, జత బూట్లు, 2 జతల సాక్సులను ప్రభుత్వం అందజేయనుంది. ఈ రెండు స్కీమ్స్ ప్రయోజనం పొందాలంటే విద్యార్థులు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ ఆధార్ లేకపోతే.. విద్యాశాఖ ద్వారా ఆధార్‌ను నమోదు చేయించనున్నారు.
అయితే ఆధార్ వచ్చే వరకు స్టూడెంట్స్ తల్లిదండ్రుల ఓటరు గుర్తింపు కార్డు, కిసాన్ పాస్‌బుక్, ఉపాధి పథకం కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు లేదా డ్రైవింగ్ లైసెన్సు, తపాలా పాస్‌బుక్ వ్యక్తిని వెరిఫై చేస్తూ.. గెజిటెడెట్ ఆఫీసర్ జారీ చేసిన సర్టిఫికెట్, ఎమ్మార్వో ఇచ్చే సర్టిఫికెట్ తదితర పత్రాలను అనుమతిస్తారని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ స్కీమ్స్‌కు పూర్తి విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.