‘అదేమిటో… చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను’ అనుకునేవారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మీరు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అనుసరించే మెమోరీ ట్రిక్స్ ఫాలో కావాల్సిందే.
‘ట్రిక్స్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్’ అంటున్నాడు మస్క్. వాటిలో కొన్ని…
బ్రెయిన్ అనేది కొన్నిసార్లు అనవసర సమాచారంతో, అనవసర ఆలోచనలతో చెత్తబుట్టగా మారిపోతుంది. దీంతో అవసరమైన విషయాలకు చోటు ఉండదు. అందుకే అనవసర విషయాలను ఎప్పటికప్పుడూ డిలీట్ చేసి మంచి విషయాల కోసం స్పేస్
ఏర్పాటు చేసుకోవాలి.
ముఖ్యమైన విషయాలతో ‘మెమోరీ ట్రీ’ నిర్మించాలి. ఈ చెట్టుకు కొమ్మలుగా కొత్త విషయాలను అనుసంధానిస్తూ పోవాలి.
ఎవరికివారు పర్సనల్ కోడింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. విషయాలను వేగంగా గుర్తు తెచ్చుకోవడానికి సంఖ్యలు, చిహ్నాలు, చిత్రాలు.. మొదలైన వాటిని ఉపయోగించాలి. ‘ఈ ట్రిగ్గర్‌లు మెదడులోని సంక్లిష్ట సమాచారాన్ని త్వరగా, తక్కువ శ్రమతో తిరిగి పోందడానికి ఉపయోగపడతాయి’ అంటాడు మస్క్.
విషయాలు, పేర్లను గుర్తు తెచ్చుకోవడంలో ‘మీనింగ్‌ఫుల్ కనెక్షన్’ ముఖ్యం అంటాడు ఎలాన్ మస్క్. ఉదాహరణకు ఒక వ్యక్తి పేరును గుర్తు తెచ్చుకోవడానికి వారి హాబీ, ఫన్నీస్టోరీ, వారి ముఖానికి సంబంధించి యూనిక్ ఫీచర్, ఆ వ్యక్తి నవ్వు, మాట్లాడే పద్ధతి… మొదలైన వాటితో పేరును గుర్తు పెట్టుకోవాలి.
మీనింగ్‌ఫుల్ కనెక్షన్ అనేది ఎందుకు ముఖ్యమైనది అంటే… మన మెదడు ర్యాండమ్ ఫ్యాక్ట్స్ కంటే స్టోరీలను, ఎమోషన్‌లనూ ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది.
‘అసోసియేట్ ఇన్‌ఫర్‌మేషన్’ టెక్నిక్ గురించి నొక్కిచెబుతున్నాడు మస్క్. అసాధారణ దృశ్యాలతో, సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడమే… అసోసియేట్ ఇన్‌ఫర్‌మేషన్. ఉదాహరణకు… ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు అరటిపండ్లు కొనాలనుకున్నారు. ఇందుకోసం ఒక అసాధారణ దృశ్యాన్ని మదిలో ఆవిష్కరించుకోవాలి. ఏనుగంత సైజులో ఉన్న అరటిపండు సన్‌గ్లాసెస్ ధరించి మీ కిచెన్‌లో డ్యాన్స్ చేస్తుంటుంది!
‘రిపీట్ అండ్ రివ్యూ’ మెథడ్‌లో భాగంగా గతంలోకి వెళ్లి మనకు నచ్చిన విషయాలను గుర్తు తెచ్చుకోవాలి. ఇలా తరచుగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది.

































