Bapatla: డ్రోన్‌ను చూసి పేకాట ఆడుతున్నవారంతా పరుగందుకున్నారు.

అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు బాపట్ల జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. నిర్మానుష ప్రదేశాలలో డ్రోన్‌లతో నిఘా పెడుతున్నారు. చుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యడ్లపల్లి గ్రామం శివారులో పేకాట ఆడుతున్న స్థావరాన్ని పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించారు. డ్రోన్‌ను చూసి పేకాట ఆడుతున్నవారంతా పరుగందుకున్నారు. పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు.