దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరం ముగింపుకు వచ్చింది. మరోవైపు పలు కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, విద్యా సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రవేశాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి.
దీంతో విద్యార్ధులు, నిరుద్యోగులు ఫుల్ ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఏడాది చివరి నెలలో అడుగు పెట్టేశాం. ఈ నెల మొత్తం పరీక్షలతో బిజీబిజీగా గడవనుంది. ఇప్పటికే విడుదలైన పలు నోటిఫికేషన్లు రాత పరీక్షల తేదీలను విడుదల చేశాయి. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో పలు ఉద్యోగ, ప్రవేశ ప్రకటనలకు సంబంధించి జరగనున్న రాత పరీక్షలు, వాటి తేదీలు ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. అభ్యర్ధుల సన్నద్ధతకు చక్కని ప్రణాళికతో ముందుకు సాగడానికి ఇవి ఉపయోగపడతాయి. అసలింతకీ ఏ పరీక్ష ఏయే తేదీల్లో జరుగుతాయంటే..
ఏ పరీక్ష ఏ తేదీల్లో ఉన్నాయంటే?…
- ఎస్ఎస్సీ జేఈ రాత పరీక్షలు డిసెంబర్ 3 నుంచి 6 వరకు జరుగుతాయి.
- క్లాట్- 2026 రాత పరీక్ష డిసెంబర్ 7వ తేదీన జరుగుతుంది.
- ఎస్ఎస్సీ సీఏపీఎఫ్ రాత పరీక్షలు డిసెంబర్ 9 నుంచి 12 వరకు జరుగుతాయి.
- ఆర్ఆర్బీ గ్రూప్-డి రాత పరీక్షలు నవంబర్ 27 నుంచి జనవరి 16 వరకు జరుగుతాయి.
- ఎస్ఎస్సీ దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) రాత పరీక్షలు డిసెంబర్ 18 నుంచి జనవరి 6 వరకు జరుగుతాయి.
- ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్-2024 సీబీటీ 2 రాత పరీక్ష డిసెంబర్ 20వ తేదీన జరుగుతుంది.
- జవహార్ నవోదయ విద్యాలయ 6వ తరగతి రాత పరీక్ష డిసెంబర్ 13వ తేదీన జరుగుతుంది.
- ఏపీ టెట్ 2025 రాత పరీక్షలు డిసెంబర్ 10 నుంచి జరుగుతాయి.
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ రాత పరీక్షలు డిసెంబర్ 6, 7, 13, 14 వరకు జరుగుతాయి.
- ఎస్ఎస్సీ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ రాత పరీక్ష డిసెంబర్ 14వ తేదీన జరుగుతుంది.
- ఎస్ఎస్సీ దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ రాత పరీక్షలు డిసెంబర్ 16, 17 వరకు జరుగుతాయి.
- సీఎస్ఐఆర్ యూజీసీ 2025 నెట్ రాత పరీక్ష డిసెంబర్ 18వ తేదీన జరుగుతుంది.
- యూజీసీ నెట్ 2025 రాత పరీక్షలు డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు జరుగుతాయి.



































