నలుగురు పిల్లలను పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపాడు ఓ తండ్రి. అనంతరం అతడు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో జరిగింది. మృతుల్లో ముగ్గురు బాలికలు, ఐదేళ్ల చిన్నారి ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుని తండ్రి నిద్రలేపేందుకు ఇంట్లోకి వెళ్లగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మన్‌పుర్ చచారి గ్రామానికి చెందిన రాజీవ్‌కు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయమైందని అప్పట్నుంచి చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. గాయం కారణంగా అతడు ఎప్పుడు కోపంగా ఉండేవాడని ఈ క్రమంలోనే దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుని భార్య ఘటన జరగడానికి ముందు తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్లిందని చెప్పారు. ఆయుధాన్ని పదునుచేసేందుకు నిందితుడు శ్యాండ్ పేపర్‌ను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలి నుంచి ఆయుధంతో పాటు శ్యాండ్ పేపర్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.