పండగ స్పెషల్ ‘గోంగూర మటన్’.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్

సంక్రాంతి పండగ అంటే ఇంటిల్లిపాది పిల్లాపాపలు, అతిథులతో నిండిపోతుంది. అయితే పండగంటే చికెన్ లేదా మటన్ ఉండాల్సిందే. రెగ్యూలర్ గా కాకుండా ఇలా వెరైటీగా గోంగూర మటన్ తయారీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.


మరి ఈ టేస్టీ ఘుముఘుమలాడే ‘గోంగూర మటన్’ ను ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?

సూపర్ టేస్టీ గోంగూర మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. మటన్‌ ముక్కలు అర కిలో, గోంగూర కట్టలు, ఉల్లిపాయలు పావు కిలో, అల్లంవెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్లు, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర తురుము కొద్దిగా, సోయకూర రెండు కట్టలు, పచ్చిమిర్చి ఆరు లేదా ఏడు, నూనె తగినంత, ఉప్పు తగినంత తీసుకోవాలి.

గోంగూర మటన్ తయారీ విధానం చూస్తే.. ముందుగా మటన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి వాటిని కుక్కర్ లో వేయాలి. ఆ మటన్ లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నూనె తగినంత, పచ్చి మిర్చి ముక్కలు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు సరిపడా, పావు లీటర్ నీళ్లు పోయాలి. కుక్కర్ ఆన్ చేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాణలిలో వేయాలి. సోయకూర వేసి నీళ్లన్నీ ఆవిరైపోయేవరకు వేయించుకోవాలి. మరో బాణలిలో గోంగూర ఆకులు వేసి ఉడికించుకోవాలి. అలా మెత్తని ముద్దలా చేసి.. ఈ ముద్దను మటన్‌ లో వేయాలి. అలా మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ గోంగూర మటన్ రెడీ అయినట్టే..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.