ఉచిత గ్యాస్ పథకం.. ఒకేసారి మూడు సిలిండర్లకు.. సీఎం సంచలన నిర్ణయం

ఏపీ ప్రభుత్వం ( AP government)మరో నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు గత ఏడాది దీపావళి నుంచి పథకాన్ని ప్రారంభించారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ పథకం విషయంలో లబ్ధిదారుల నుంచి అనేక రకాల అభ్యంతరాలు వచ్చాయి. గ్యాస్ సిలిండర్ విడిపించుకున్న తరువాత ప్రభుత్వం రాయితీ సొమ్ము వేయడంతో కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో ఈ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అందుకే ఈ పథకం అమలు విషయంలో చంద్రబాబు మరోసారి పునసమీక్షించుకున్నారు. గ్యాస్ విడిపించక ముందే లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయాలని భావిస్తున్నారు.


* పేద వర్గాలకు అండ..
సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్( free gas cylinder) పథకాన్ని ప్రవేశపెట్టారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా పొందుపరచడంతో పేద వర్గాల్లో సంతృప్తి వ్యక్తం అయింది. ప్రతి సంవత్సరం ఓ 3 వేల రూపాయల వరకు ఆర్థిక భారం తగ్గనుండడం నిరుపేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం. అయితే ఈ పథకం అమలులో జాప్యం జరగలేదు. గత ఏడాది దీపావళి నుంచి ఈ పథకం అమలు చేయడం ప్రారంభించారు. అయితే సాంకేతిక కారణాలతో తమకు గ్యాస్ రాయితీ నగదు అందడం లేదన్న ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది.

* ఒకేసారి రాయితీ..
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. నాలుగు నెలలకు ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తారు. అయితే గ్యాస్ సిలిండర్ విడిపించక మునుపే.. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో( bank accounts ) ఆ రాయితీ మొత్తం వేసేందుకు ముందుగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏడాదిలో అందించే మూడు గ్యాస్ సిలిండర్లకు ఒకేసారి రాయితీ అందించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్ సిలిండర్ల పథకం పై అధికారులతో కీలక సమీక్ష చేశారు సీఎం చంద్రబాబు. ఇకనుంచి ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒకేసారి నగదు చెల్లింపులు చేద్దామని సీఎం చెప్పుకొచ్చినట్లు సమాచారం. అదే జరిగితే పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగినట్టే.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.