బాడీగార్డ్ నుంచి ప్రపంచ స్థాయి బౌలర్ దాకా.. బ్యాట్స్‌మెన్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న షామర్ జోసెఫ్

www.mannamweb.com


వెస్టిండీస్ క్రికెట్ జట్టు.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన జట్టు. బుల్లెట్ల లాంటి బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్లను వణికించే బౌలర్లు, సెంచరీలు, డబుల్ సెంచరీలతో కదంతొక్కే బ్యాట్స్‌మెన్లు ఆ జట్టు సొంతం.

జట్టు ఏదైనా సరే సమష్టిగా రాణించి వరుస విజయాలతో ఉర్రూతలూగించిన జట్టు విండీస్. కానీ ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు సీనియర్ల రిటైర్మెంట్లతో ఆ జట్టు బలహీనంగా మారింది. బోర్డు సభ్యులు, ఆటగాళ్లకు మధ్య వివాదాలు తలెత్తడంతో ఆ దేశంలో క్రికెట్ పతనమైంది.

యువ ఆటగాళ్లతో కొత్త జోష్..

ప్రస్తుతం విండీస్ జట్టు కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతోంది. తగేనారాయణ్ చందర్‌పాల్, క్రిక్ మెకెంజీ, కావెమ్ హాడ్జ్, జస్టీన్ గ్రీవ్స్, జోషువా డిసిల్వా, షామర్ జోసెఫ్, కెవిన్ సింక్లెయిర్ లాంటి యువ ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తున్నారు. దీంతో మళ్లీ విండీస్ జట్టుకు మళ్లీ పాత కలొచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకు ఉదాహరణ బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించడమే.
బౌలింగ్ సంచలనం షామర్ జోసెఫ్..

షామర్ జోసెఫ్ కరేబియన్ దీవుల్లోని గయానాలోని బారకర అనే కుగ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ సౌకర్యాలు లేకుండా క్రికెట్ మీద అతడికి ఉన్న ప్రేమ, నేర్చుకోవాలనే పట్టుదల అతడిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది. తాను యుక్త వయసులో ఉన్నప్పుడు తన స్నేహితుల సాయంతో 1980-90 దశకాల్లోని వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు కార్ల్టీఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్ క్రికెట్ టెస్ట్ హైలైట్స్ చూస్తూ.. బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు.

కుటుంబ భారాన్ని మోసేందుకు తాను బాడీగార్డ్‌గా కూడా పని చేశాడు. కష్టాలను అధిగమించాలని నమ్ముకున్న ఉద్యగానికి రాజీనామా చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. 2023లో గయానా హార్పీ ఈగల్స్ జట్టు తరపున ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు సంపాదించి తన కలను నెరవేర్చుకున్నాడు. అనంతరం సౌతాఫ్రిక పర్యటనకు ఎంపికై ఆశించన మేర వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. నేరుగా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు ఎంపికై ప్రస్తుతం కంగారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

గాయం ఇబ్బంది పెడుతున్నా.. అతడే ఒక సైన్యంలా

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో షామర్ జోసెఫ్ 7 వికెట్లతో చెలరేగాడు. దీంతో గబ్బాలో వెస్టిండీస్ ఎనమిది పరుగులతో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన యార్కర్ జోసెఫ్ కాలిని బొటను వేలును తీవ్రంగా గాయపరిచింది. దీంతో అతడు రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తిరిగి అతడు నాలుగో రోజు మైదానంలోకి వస్తాడా అనే సందిగ్ధం నెలకొంది. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. షామర్ జోసెఫ్ గ్రౌండ్‌లోకి చిరుతల ఎంటరయ్యాడు.
మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల ఇది ఆట..లేక యుద్ధమా అన్న తీరులో షామర్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను గడగడలాడించాడు. అల్‌రౌండర్ కామోరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, హెజిల్‌వుడ్ ఇలా.. క్రీజ్‌లోకి వచ్చిన వారిని ఒకరి తరువాత మరొకరిని పెవిలియన్‌కు పంపాడు. పేసర్ షామర్ జోసెఫ్ మొత్తం 68 పరుగులిచ్చి 7 వికెట్లను నేలకూల్చడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో 27 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాను స్వదేశంలో ఓడించింది.