ఏపి ప్రజలకు టీడీపీ-జనసేన కూటమి పార్టీలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ (Jayaho BC)బహిరంగ సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan), చంద్రబాబు(Chandrababu) బీసీ డిక్లరేషన్ (BC Declaration)ప్రకటించారు.
10అంశాలతో డిక్లరేషన్ విడుదల చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబునాయుడు. ఈసందర్భంగా ఏపీలో టీడీపీ(TDP)-జనసేన (Janasena)కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు 50ఏళ్లకే నెలకు రూ.4వేల పెన్షన్ అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బీసీలను పల్లకి మోసే వాళ్లుగా చూస్తోందని .. బీసీ పల్లకీ మోసే వాళ్లు కాదని సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్లని చంద్రబాబు బహిరంగ సభ ద్వారా తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత కల్పిస్తామని మాటిచ్చారు. బీసీ సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు చేస్తామని ఆ నిధుల్ని బీసీలకే వినియోగించేలా చర్యలు తీసుకుంటామని వాగ్ధానం చేశారు చంద్రబాబు. ఈ బహిరంగ సభ వేదికపైనే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే గుమ్మునూరి జయరాం టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కండువ కప్పి పార్టీలో ఆహ్వానించారు. వైసీపీలో స్వతంత్రం లేదని టీడీపీలో చేరడం చిన్నపిల్లవాడు తప్పిపోయి తిరిగి సొంత ఇంటికి చేరుకున్నట్లుగా ఉందని జయరాం తెలిపారు.
బీసీలకు పెద్దపీట..
టీడీపీ-జనసేన కూటమి మంగళగిరిలో జయహో బీసీ సభ నిర్వహించింది. ఈసభకు భారీ ఎత్తున బీసీ సంఘాన నాయకులు, సోదరులు హాజరయ్యారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు చంద్రబాబు. ఈసందర్భంగా జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీలకు మేలు కలిగే 10అంశాలతో ఈ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో ముఖ్యమైనది ఏపీలో 50ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది టీడీపీ-జనసేన కూటమి.
బీసీ డిక్లరేషన్ లోని 10అంశాలు ఇవే..
1.బీసీలకు 50ఏళ్లకే పెన్షన్
2.రూ.4వేలకు పెంచుతూ నిర్ణయం
3.బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
4.సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు
5.బీసీ బస్ ప్లాన్ తో 5ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయింపు
సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
6.స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
7.చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
8.అన్నీ సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్
కొన్ని బీసీ వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా ఛాన్స్
9.జనాభా ప్రతిపాదికన కార్పొరేషన్ల ఏర్పాటు, జనాబా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
10.బీసీల స్వయం ఉపాధికి రూ.10వేల కోట్లు, 5వేల కోట్లతో ఆదరణ పరికరాలు