నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఒకే చోట

నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఒకే చోట ఉండేలా కొత్త బడులు తెరవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు.


పైలట్‌ ప్రాజెక్ట్‌గా నూతన స్కూళ్లను ఏర్పా టు చేయాలని సూచించారు. శుక్రవారం సీఎం తన నివాసంలో విద్యాశాఖపై సమీక్షించారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ఈ కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే వీటిని ప్రారంభించాలని తెలిపారు. తొలి దశలో ఓఆర్‌ఆర్‌ లోపల గల కోర్‌ అర్బన్‌ రీజియన్‌పై దృష్టిసారించాలని పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.