Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ద్రవిడ్ వారసుడిగా ప్రయాణం ఎప్పటివరకంటే?

www.mannamweb.com


Team India Head Coach Gautam Gambhir: భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ధృవీకరించింది. భారత మాజీ ఓపెనర్ మూడేళ్ల కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన ఈ దిగ్గజ ఆటగాడు.. రాహుల్ ద్రవిడ్‌కు వారసుడిగా మారాడు. టీమిండియా 2011 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన గంభీర్, అశోక్ మల్హోత్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీ, జూమ్ ద్వారా WV రామన్‌తో కలిసి ఇంటర్వ్యూ చేసింది. చివరకు ఈ కమిటీ గంభీర్‌ను సిఫార్సు చేసింది. దీంతో నేడు గంభీర్‌ను హెడ్ కోచ్‌గా ప్రకటించారు.

కాగా, గంభీర్ అధికారికంగా జులైలో తన పదవీకాలాన్ని ప్రారంభిస్తాడు. తదుపరి ODI ప్రపంచ కప్ అంటే, డిసెంబర్ 31, 2027 వరకు ఈ పదవీలో ఉంటాడు. గంభీర్ ఎన్నడూ అధికారికంగా జట్టుకు కోచ్‌గా చేయనప్పటికీ.. అతను IPL ఫ్రాంచైజీలు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మెంటార్‌గా అనుబంధం కలిగి ఉన్నాడు. ప్రధాన కోచ్‌కి దరఖాస్తు గడువుకు ఒక రోజు ముందు మే 26న మూడవ IPL టైటిల్‌ సాధించి సత్త చూపించాడు గంభీర్.

అయితే, బీసీసీఐ రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌లను ఈ పోస్ట్ కోసం పరిశీలిస్తున్నట్లు ప్రాథమిక నివేదికలు సూచించాయి. అయితే, బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ వాదనలను ఖండించారు. బోర్డు మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్లను సంప్రదించలేదని, భారత కోచ్‌ని నియమించడంపై దృష్టి పెట్టిందని పేర్కొన్నాడు.

జైషా అభినందనలు..
“భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని నేను స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. గౌతమ్ ఈ మార్పును దగ్గరగా చూశాడు. తన కెరీర్‌లో వివిధ పాత్రల్లో రాణించి, కష్టాలను తట్టుకుని, భారత క్రికెట్‌ను ముందుకు నడిపించడానికి గౌతమ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది”అంటూ జైషా రాసుకొచ్చారు.

” టీమిండియా పట్ల అతని స్పష్టమైన దృష్టి, అపారమైన అనుభవంతో పాటు, ఈ ఉత్తేజకరమైన కోచింగ్ పాత్రను స్వీకరించేందుకు ఆహ్వానం అందిస్తున్నాం. ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు బీసీసీఐ అతనికి పూర్తిగా మద్దతు ఇస్తుంది” అంటూ ట్వీట్ చేశాడు