Tirupati Gold ATM: తిరుపతి నగరంలో కొన్ని ప్రదేశాల్లో గోల్డ్ ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో మీరు నేరుగా మనీ తీసుకున్నట్టు గోల్డ్ ను కోనుగోలు చేయవచ్చు.
Tirupati Gold ATM: కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి కోలువైన ఆధ్యాత్మిక ప్రదేశం తిరుపతిలో “ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో” సోమవారం ఘనంగా ప్రారంభం అయింది. ఫిబ్రవరి 19 వరకు ఆ కార్యక్రమంలో జరగనుంది.
దేవాలయ పరిపాలన, నిర్వహణకు సంబంధించిన అంశాలతో ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ & ఎక్స్‌పో (ITCX) 2025 ఫిబ్రవరి19 వరకు తిరుపతిలోని ఆశా కన్వెన్షన్స్‌లో జరగనుంది.
అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో ఆశ కన్వెన్షన్ సెంటర్‌లో
టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి, అంత్యోదయ ప్రతిష్ఠాన్ సహకారంతో రూపొందించిన ITCX 2025 ప్రపంచవ్యాప్తంగా దేవాలయ పర్యావరణ వ్యవస్థలను నెట్‌వర్క్ చేయడానికి, బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి ఒక వేదికను అందిస్తూ ముందుకు సాగుతోంది. ఈ సమావేశంలో దాదాపు 58కి పైగా దేశాల్లోని సుమారు 1581 భక్తి సంస్థలు పాల్గొంటున్నాయి. 111+ స్పీకర్లు, 15 వర్క్‌షాప్‌లు & నాలెడ్జ్ సెషన్‌లతో 60+ స్టాల్‌లను కలిగి ఉంది.
తిరుపతిలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో ఆశ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన “గోల్డ్ ఏటీఎం” అందరిని ఆకర్షిస్తోంది.
ఏంటీ ఈ గోల్డ్ ఏటీఎం?
తిరుపతి నగరంలో కొన్ని ప్రదేశాల్లో గోల్డ్ ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో మీరు నేరుగా మనీ తీసుకున్నట్టు గోల్డ్ ను కోనుగోలు చేయవచ్చు. అంటే మనం ఉపయోగించే సాధారణ ఏటీఎం ల నుంచి డబ్బులు వస్తే ఇక్కడ గోల్డ్ వస్తుంది.
ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సందర్భంగా తిరుపతిలో గోల్డ్ ఏటీఎం సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎటీఎం నుంచి మనం డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్న మాదిరిగానే ఈ గోల్డ్ ఏటీఎం నుంచి నేరుగా బంగారం డాలర్లు విత్ డ్రా చేసుకోవచ్చు. తిరుమల శ్రీవారు, గోవిందరాజ స్వామి రూపంలో ఉన్న బంగారు డాలర్లు ప్రస్తుతం ఈ ఏటీఎం నుంచి కోనుగోలు చేయవచ్చు.
ప్రపంచంలోనే మొట్టమొదటి రియల్ టైమ్ గోల్డ్ ATM ను ఎక్కడ ప్రారంభించారో తెలుసా?
గోల్డ్ సిక్కా ఏటిఎం అనేది భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ ఏటిఎం. ప్రపంచంలోనే మొట్టమొదటి రియల్ టైమ్ గోల్డ్ ఏటిఎం నుంచి ప్రజలు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి బంగారు నాణేలను తీసుకోవచ్చు. హైదరాబాద్ బేగంపేటలో గోల్డ్ ఏటీఎంను ఇటీవల ప్రారంభించారు.
గోల్డ్ సిక్కా ప్రైవేట్ లిమిటెడ్ అనే గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ టెక్నాలజీ సపోర్ట్ కోసం హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ మెసర్స్ ఓపెన్క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో 2022 డిసెంబర్ 3న తన మొదటి గోల్డ్ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఫిజికల్ జువెలరీ స్టోర్కు వెళ్లకుండానే గోల్డ్ ఏటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేయొచ్చని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.