బంగారం ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చి చూస్తే నేను కూడా బంగారం ధర తగ్గినట్టు చూడవచ్చు. జూన్ 27వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.
97,360 పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,700 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,10,100 పలుకుతోంది. బంగారం ధర గడచిన నాలుగు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తోంది. ఒక దశలో ఒక లక్ష రూపాయలు దాటిన బంగారం ధర అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం 97 వేల రూపాయల వరకు పతనమైనట్లు గమనించవచ్చు. అంటే బంగారం ధర ఆల్ టైం రికార్డ్ తో పోల్చి చూసినట్లయితే దాదాపు 5000 రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గి రావడమే అసలు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన అనంతరం బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో కూడా బంగారం ధర తగ్గుముఖం పట్టింది ఈ ప్రభావం కూడా బంగారంపై గమనించవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి మరో ప్రధాన కారణం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పుంజుకోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పసిడి ధరలు మార్కెట్లో తగ్గుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది కాస్త ఊరట అని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే బంగారం ధరలు గడచిన ఏడాదికాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగాయి అని చూసుకోవచ్చు గత సంవత్సరం జూన్ నెలలో బంగారం ధర 75 వేల రూపాయలు సమీపంలో ఉంది. అక్కడ నుంచి బంగారం ధర పరచగా పెరుగుతూ ప్రస్తుతం ఏకంగా 1 లక్ష రూపాయల సమీపానికి చేరుకుంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడిని సురక్షితంగా భావిస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ బలహీనపడినప్పుడల్లా బంగారంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని గమనించవచ్చు. బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బంగారం తూకం విషయంలోనూ నాణ్యత విషయంలోనూ ఏ మాత్రం రాజీ పడవద్దు అని పేర్కొంటున్నారు.
































