ఉద్యోగులకు మరో తీపి కబురు.. ఈ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..

www.mannamweb.com


2023 జూలై 25 కంటే ముందు చేపట్టిన చర్యలకు ఈ సవరణ వర్తిస్తుందని పేర్కొంది. ఉద్యోగులపై చర్యలకు సంబంధించి చార్జ్‌ట్లను డిస్పోజ్‌ చేసేటప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ సీటీఎంలను కమిటీ సభ్యులుగా చేర్చడం, అప్పీళ్లను డిస్పోజ్‌ చేసేటప్పుడు రివ్యూ అథారిటీలో ఉమ్మడి జిల్లా రీజనల్‌ మేనేజర్‌ను సభ్యుడిగా చేర్చడం, ఆ పైస్థాయిలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు మెర్సీ పిటిషన్‌ను పరిశీలించేందుకు అనుమతించింది.
రెండేళ్లుగా అప్పీళ్లు, రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులతో ఊరట లభించింది. వారి కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది. 2023 జులై 25 తరువాత వచ్చిన కేసులకు మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వేచి ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

సర్విసు నిబంధనలను సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పలు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌ ఆర్టీసీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వహణ అధ్యక్షుడు జీఏం నాయుడు, ప్రధాన కార్యదర్శి డీఎస్‌పీ రావు, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలియజేశారు.