ఏపీలో పింఛన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్

వేలిముద్రలు స్కాన్ అవ్వక పింఛన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పింఛన్ల పంపిణీ కోసం ఎల్-0 స్కానర్లు ఉపయోగిస్తుండగా..


వాటి స్థానంలో ఎల్-1 స్కానర్లు తీసుకొచ్చారు. ఒక్కో పరికరాన్ని రూ.1,989 పెట్టి కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్-1 స్కానర్లను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి కొత్త స్కానర్ల సాయంతో పింఛన్లు పంపిణీ చేస్తారు