తెలంగాణా ప్రజలకు శుభవార్త.. అందరికీ ఫ్రీగా సూపర్ స్పెషాలిటీ వైద్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త చెప్పింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్ పేదలకు ఫ్రీగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి శ్రీకారం చుట్టింది.


వైద్య సేవలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆధునిక క్రిటికల్ కేర్ బ్లాకులను ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలోని ప్రజలకు ఫ్రీగా అత్యాధునిక వైద్య సేవలను అందించడానికి రెడీ అయింది.

ఆధునిక క్రిటికల్ కేర్ యూనిట్ల ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాలలో ఆధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ ల నిర్మాణాన్ని పూర్తి చేసిన ప్రభుత్వం త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకురానుంది. వనపర్తి, కామారెడ్డి, జనగామ, జగిత్యాల, వికారాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాలతో సహా తొమ్మిది జిల్లాలలో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ల నిర్మాణం పూర్తి చేశారు. సుమారు 50పడకల సామర్థ్యం గల ఈ యూనిట్లు మరో 15రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం.

అత్యవసర సమయాల్లో హైదరాబాద్ దాకా రావాల్సిన పని లేదు

జిల్లా స్థాయిలోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, గర్భిణీలకు అత్యవసర సమస్యల సమయంలో తక్షణ చికిత్స అందించడం కోసం కావాల్సిన అధునాతన సౌకర్యాలతో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ లను నిర్మించారు. గతంలో అనేక జిల్లాలలో అత్యవసర పరిస్థితులలో వారిని కచ్చితంగా హైదరాబాద్ కు తరలించాల్సి వచ్చేది.

కార్పొరేట్ ఆసుపత్రులకు తీసిపోని క్రిటికల్ కేర్ యూనిట్లు

ప్రస్తుతం జిల్లా కేంద్రాలలోని అందుబాటులో ఉండే విధంగా ఈ యూనిట్స్ ను ఏర్పాటు చేశారు ప్రతి క్రిటికల్ కేర్ బ్లాక్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకోకుండా అన్ని వసతుల తోటి ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోనూ 10 ఐసీయూ యూనిట్లు, ఆర్ హెచ్ డి యు యూనిట్లు, 24 ఐసోలేషన్ యూనిట్ లు అందుబాటులో ఉన్నాయి. నెగెటివ్ ప్రెజర్ వెంటిలేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.

ప్రైవేట్ దోపిడీకి చెక్

వీటితోపాటు రెండు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక డయాలసిస్ బెడ్స్ స్వతంత్ర ఆక్సిజన్ ప్లాంట్లు, అత్యాధునిక ల్యాబ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో రోగికి చికిత్స జరిగితే ఫీజుల బాదుడు ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ పరిస్థితులకు చెక్ పెట్టేలా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్లు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలను అందించనున్నాయి.

ఆరోగ్య రంగంలో తెలంగాణా ముందుకు

దీంతో వారిపైన ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. జిల్లా స్థాయిలోని మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఈ యూనిట్లు ఉండడం వల్ల వైద్య విద్యార్థులకు సైతం ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణను ఆరోగ్య రంగంలో ముందుకు తీసుకు వెళ్లేలా ఏర్పాటు చేసిన ఈ క్రిటికల్ కేర్ వ్యవస్థ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంగా నిలవనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.