Govt Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 16,347 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే..!

ఉద్యోగాలు కోసం ఎదురుచేస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న డీఎస్పీ (DSC) నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయబోతున్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది.
16,347 ఉపాధ్యాయ పోస్టులకు (Teachers Posts) ఈ DSC నోటిఫికేషన్ చేస్తారు.


నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉంటారని పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్‌పై తన తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 16,347 పోస్టులు భర్తీకి ఆయన ఆమోదం తెలిపారు. ఇక నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టులు..
స్కూల్ అసిస్టెంట్ (School Assistant) – 7,725 పోస్టులు
SGT (Secondary Grade Teacher) – 6,371 పోస్టులు
TGT (Trained Graduate Teacher) – 1781 పోస్టులు
PGT (Post Graduate Teacher) – 286 పోస్టులు
ప్రిన్సిపల్స్ – 52 పోస్టులు
PET (Physical Education Teacher) – 132 పోస్టులు

భర్తీ చేయబోయే పోస్టులలో జిల్లా పరిషత్ , మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఉన్నాయి.
రెసిడెన్షియల్ స్కూల్స్ , మోడల్ స్కూల్స్ , బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జిల్లాలు వారీగా ఖాళీలు
శ్రీకాకుళం – 543
విజయనగరం – 583
విశాఖపట్నం – 1134
తూర్పుగోదావరి – 1346
పశ్చిమగోదావరి – 1067
కృష్ణ – 1213
గుంటూరు – 1159
ప్రకాశం – 672
నెల్లూరు – 673
చిత్తూరు – 1478
కడప – 709
అనంతపురం – 811
కర్నూలు – 2678