Good news SBI hikes FD rates: ఎఫ్‌డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ.. లేటెస్ట్‌ వడ్డీ రేట్లు ఇవే.

www.mannamweb.com


దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (State Bank of India) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (fixed deposit ) వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లపైనా, అలాగే, రూ.2 కోట్ల పైబడిన బల్క్‌ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రూ.2 కోట్లలోపు రిటైల్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ గరిష్ఠంగా 75 బేసిస్‌ పాయింట్ల మేర ఎస్‌బీఐ వడ్డీని పెంచింది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీపై గతంలో 4.75 శాతం వడ్డీకి బదులు ఇకపై 5.50 శాతం చెల్లించనుంది. సీనియర్‌ సిటిజన్లకు 5.25 శాతంగా ఉన్న ఈ వడ్డీని శాతానికి పెంచింది. 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై ప్రస్తుతం ఉన్న వడ్డీని 6 నుంచి 6.25 శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 6.75 శాతం వడ్డీ లభించనుంది.

ఇక 7 రోజుల నుంచి 45 రోజుల బల్క్‌ డిపాజిట్లపై వడ్డీని 25 బేసిస్‌ పాయింట్ల మేర ఎస్‌బీఐ పెంచింది. ప్రస్తతం ఈ ఎఫ్‌డీలపై 5 శాతం వడ్డీ అందిస్తుండగా.. ఇకపై 5.25 శాతం చొప్పున వడ్డీ ఇవ్వనుంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీపై 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.75 శాతం నుంచి 6.25 శాతానికి వడ్డీ పెంచింది. ఇదే కాలానికి సీనియర్‌ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.

రూ.2కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ ఇలా..