Aarogya sri: ఆరోగ్య శ్రీపై సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..

www.mannamweb.com


Aarogya sri: ఆరోగ్య శ్రీపై సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..

Aarogya sri: ఆరోగ్య శ్రీ చికిత్సలకు సంబంధించి సంచలన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.

1,375 ప్యాకేజీల ధరలు సవరిస్తూ తాజాగా జీవో 30ని విడుదల చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు చేయడం లేదని ఆ జీవోలో పేర్కొంది.

అయితే ఆరోగ్యలో ఇటీవలే కొత్తగా 163 చికిత్సలను చేర్చుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున 20శాతం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వంపై రూ.438 కోట్ల భారం పడుతుందన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా కుటుంబాలపై భారం తగ్గుతుందన్నారు. ఫలితంగా ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. పేదలకు నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి అదనపు ఖర్చు రూ.600 కోట్లు పెరిగిందన్నారు. ఈ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ దాదాపు 6 లక్షల మందికి బాసటగా ఉందని వెల్లడించారు. కొత్త ప్రొసీజర్స్‌తో మరో లక్షన్నర కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోబోతోందన్నారు. 79 లక్షల కుటుంబాలకు ఆరోగ్యపరంగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.