పెన్షన్ల పంపిణీ పై ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు – అక్కడే పంపిణీ..!!

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పెన్షన్ల పంపిణీ (Pensions) విషయంలో గత రెండ్రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వలంటీర్ల (Volunteers) ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. మొత్తం చేసింది టీడీపీయేనని వైసీపీ.. మాకేంటి సంబంధం అని కూటమి ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన వచ్చేసింది.
ఇలా తీసుకోండి..!


పింఛన్ల పంపిణీపై అధికారులకు సెర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో మాత్రమే సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ వల్ల వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని కూడా తెలిపింది. పింఛను లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లి పెన్షన్లు తీసుకోవాలని సెర్ప్ తెలిపింది.