Crop Insurance: రైతులకు అదిరిపోయే వార్త.. రైతులందరికీ ఉచితంగా పంటల బీమా

www.mannamweb.com


Crop Insurance: రైతులకు అదిరిపోయే వార్త.. రైతులందరికీ ఉచితంగా పంటల బీమా

Crop Insurance:ఏపీలోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని రైతులందరికీ శుభవార్తను అందించింది. భారీ వర్షాలు, ప్రక్రుతి విపత్తుల నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

రైతులందరికీ పంట బీమా అమలు చేయాలని మంత్రి వర్గ సబ్ కమిటీ నిర్ణయించింది. దీంతో రైతులందరికీ చాలా మేలు జరగనుంది. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని సెక్రటేరియట్ లో సబ్ కమిటీలోని మంత్రులు అచ్చెన్న, పయ్యావుల , నాదెండ్ల మనోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర సర్కార్ సూచించిన విధానాల్లో ఏ విధానం బాగుంది..దాని వల్ల రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో పూర్తి సమాచారం తెలుసుకుని ఆ విధానాన్ని అమలు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. బీమా అమలు, క్లైమ్స్ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు ఓ నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించారు.

కాగా పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పంట బీమా ప్రీమియం భారం రైతులకు పై పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ కూడా ఈ ఉచిత పంట బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరువు, తుపాన్ వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన రైతన్నలకు అండగా నిలించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏపీలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.