Guntagalagara Aku : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది..!

www.mannamweb.com


Guntagalagara Aku : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది.

పూర్వకాలంలో 40 సంవత్సరాలు పై బడిన వారిలో మాత్రమే మనకు తెల్ల జుట్టు కనబడేది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారు. మన శరీరంలో 40 సంవత్సరాల తరువాత మెలనిన్ శాతం తగ్గి జుట్టు తెల్ల బడుతుంది. కానీ ప్రస్తుత తరుణంలో 40 కంటే తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతోంది. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉంటాయి.

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల డైలను, హెన్నా పౌడర్ ల వాడుతూ ఉంటారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ద్వారా మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి పరిసరాలలో ఉండే గుంటగలగరాకును ఉపయోగించి మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ మొక్క మనకు విరివిరిగా కనిపిస్తూనే ఉంటుంది. చూడడానికి పిచ్చి మొక్కలా ఉండే ఈ గుంటగలగరాకును ఉపయోగించి మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
Guntagalagara Aku

అంతేకాకుండా మనకు వచ్చే అన్ని రకాల జుట్టు సమస్యలను నయం చేయడంలో కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. గుంటగలగరాకు మొక్కను సమూలంగా సేకరించి శుభ్రంగా కడిగాలి. అనంతరం దాన్ని మెత్తగా నూరి దానిని కొబ్బరి నూనెలో వేసి చిన్న మంటపై నూనె నల్లగా అయ్యే వరకు మరిగించాలి. తరువాత వడకట్టి చల్లగా అయ్యే వరకు ఉంచి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతిరోజూ రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గి జట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ నూనెను వాడడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు ఉండవు. సహజ సిద్దంగా గుంటగలగరాకును ఉపయోగించి మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడమే కాకుండా జుట్టు సమస్యలన్నింటినీ నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.