H1B Visa: లే ఆఫ్‌ల వేళ హెచ్‌ 1బీ వీసాదారులకు శుభవార్త!

H1B Visa: అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో దిగ్గజ కంపెనీలు ఖర్చుల తగ్గింపుపై దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే గూగుల్, టెస్తా, వాల్‌మార్ట్‌ వంటి మల్టీ నేషనల్‌కమపెనీలు ఉద్యోగులను తొలగించాయి. వీరిలో చాలా మంది విదేశీయులు ఉన్నారు. జాబ్‌ పోయిన నేపథ్యంలో స్వదేశాలకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదనుకుంటున్న హెచ్‌1బీ వీసా టెకీలకు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) శుభవార్త చెప్పింది. జాబ్‌ లేని వారికి ఉన్న ప్రత్యామ్నాయాలు తెలుపుతూ మార్గదర్శకాలు జారీ చేసింది.


అమెరికాలోనే ఉండే అవకాశం..
ప్రత్యామ్యాయాలను ఉపయోగించుకోవడం ద్వారా 60 రోజుల గ్రేస్‌ పీరియడ్, తర్వాత అమెరికాలో ఉండే అవకాశం లభించనుంది. తర్వాత లేఆఫ ఎదుర్కొంటున్న హెచ్‌1బీ వీసాదారులు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్‌లో మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. బలవంతపు పరిస్థితుల ఉపాధి అధికార పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ మారేందుకు పిటిషన్‌ దాఖలుచేసి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి..
60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌లో ఈ ప్రత్యామ్నాయాల్లో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవాలి. తద్వారా హెచ్‌1బీ వీసాదారులకు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్టేటస్‌ కోల్పోయినప్పటికీ అధికారికంగా అమెరికాలో కొంతకాలం ఉండే అవకాశం పొందుతారు. అర్హత ఉన్న హెచ్‌1బీ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌లు, కొత్త హెచ్‌1బీ పిటిషన్‌ దాఖలు చేసిన వెంటనే వేరే కంపెనీల్లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 180 రోజుల స్టేటస్‌ పెండింగ్‌ గడువు తర్వాత వారి స్టేటస్‌ అప్లికేషన్‌ను కొత్త కంపెనీ ఉద్యోగ ఆఫర్‌ కింద సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక ప్రస్తుత స్టేటస్‌ను డిపెండెంట్‌ లేదా స్టూడెంట్‌ లేదా విజిటర్‌ స్టేటస్‌ కిందకు కూడా మార్చుకునే వీలు ఉంటుంది. ఈ నిర్ణయాలతో చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్నట్లు పరిగణించకుండా ఉండే అవకాశం ఉంటుంది. సెల్ఫ్‌–పిటిషన్డ్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా పిటిషన్లు వేసే ఉద్యోగుల స్టేటస్‌ అప్లికేషన్‌ సర్దుబాటుతోపాటే ఈ పిటిషన్‌ను కూడా ఒకేసారి ఫైల్‌ చేయవచ్చు. దీనివలన అమెరికాలోనే ఉండేందుకు ఏడాదిపాటు అవకాశం లభిస్తుంది.