జన్మలో రాదనుకున్న జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.. బట్టతలను మాయం చేసే సూపర్ ట్రిక్

www.mannamweb.com


అందమైన, ఒత్తయిన, పొడవాటి జుట్టు ఉండాలని ఎవరైతే కోరుకోరు చెప్పండి. ఇలా జుట్టు ప్రతి ఒక్కరి అందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో మారిన ఆహారపు అలవాట్లు జీవనశైలి కారణంగా చాలామంది జుట్టు రాలే సమస్యలను ఎదుర్కోవడం అలాగే బట్టతల సమస్యతో బాధపడటం జరుగుతుంది ఇలా బట్టతల సమస్యతో బాధపడుతున్న వారు ఈసింపుల్ చిట్కాలను పాటిస్తే కనుక తిరిగి ఒత్తయిన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.
చిన్న వయసులోనే బట్టతల రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అలాంటి వాటిలో పని ఒత్తిడి, సరైన స్థాయిలో పోషకాలు అందకపోవడం నిద్రలేమి వంటి సమస్యల కారణంగా చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడానికి కారణం అవుతుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

ఉల్లిపాయ: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మన తలలో రక్తప్రసరణను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుంది. దీనికోసం ఉల్లిపాయలు మెత్తగా మిశ్రమంలా తయారు చేసి అందులో నుంచి రసం బయటకు తీయాలి ఆ రసంలోకి రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి తలకు బాగా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా జుట్టుకు పోషకాలు అంది ఒత్తుగా పెరగడానికి కారణం అవుతుంది.

ఆముదం: స్వచ్ఛమైన గానుగలో తీసిన ఆముదపు నూనె బట్టతల సమస్య నుంచి బయటపడటానికి కారణం అవుతుంది. ఇలా ఆముదపు నూనెను వేలితో సహాయంతో తలమాడుకు మొత్తం బాగా అంటే విధంగా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బేబీ హెయిర్ వచ్చి బట్టతల సమస్య నుంచి మనల్ని బయటపడేలా చేస్తుంది.

కలబంద: కలబందలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి ఇది సహజంగా చర్మ జుట్టు సౌందర్యాన్ని పెంపొందించడంలో దోహదపడుతుంది అందుకే వారంలో రెండు మూడు సార్లు కలబంద జెల్ మన తలకు పట్టించి బాగా మసాజ్ చేసిన తర్వాత తల స్నానం చేయాలి ఇలా వారంలో రెండు మూడు సార్లు కనుక చేస్తే జుట్టు ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఇలా ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే ఒత్తయిన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.