విటమిన్లు అన్నీ శరీరానికి ఏదో ఒక విధంగా ఆరోగ్యాన్ని అందించేవి. వాటిలో కొన్నింటికి అధిక ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటి గురించి అసలు తెలియదు. అలాంటిదే విటమిన్-పి. విటమిన్ A, B, C, D,E ఈ వరకు తరచూ వింటూనే ఉంటాం. కానీ విటమిన్ పి (vitamin p) అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. విటమిన్ P లోపం అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, విటమిన్ పి కలిగి ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ పి అంటే ఏమిటి.? అది ఏ ఆహారాలలో దొరుకుతుంది..? దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.
విటమిన్ పి అనేది కచ్చితంగా విటమిన్ అని కాదు. ఫ్లేవనాయిడ్స్‌ని విటమిన్ పి అని కూడా పిలుస్తారు. ఫ్లేవనాయిడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీలు కలిగిన ఒక ఫైటో న్యూట్రియంట్. సింపుల్‌గా చెప్పాలంటే ఈ విటమిన్ పి అనేది ఎక్కువగా మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలలో ఉంటుంది.
ఫ్లేవనాయిడ్లను విటమిన్ పి అని కూడా అంటారు. ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఒక ఫైటో న్యూట్రియంట్. ఈ విటమిన్ పి ప్రధానంగా మొక్కల నుంచి దొరికే ఆహారాలలో కనిపిస్తుంది.విటమిన్ పి తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల పనితీరు బాగుంటుంది. విటమిన్ పి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే ఆస్తమా, కీళ్లనొప్పులు, అలర్జీలను నివారిస్తుంది
బయోఫ్లేవనాయిడ్ లోపం లక్షణాలు విటమిన్ సి మాదిరిగానే ఉంటాయి. అతి పెద్ద లక్షణాలు సులభంగా గాయాలు, రక్తస్రావం. దెబ్బతగిలిన చోట తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. దీని లోపం ఆర్థరైటిస్‌కు సంబంధించిన వాపుకు కూడా కారణమవుతుంది. దీని తీవ్రమైన లోపం వల్ల స్కర్వీ, చిగుళ్లు, దంతాల సమస్యలు, చర్మం, జుట్టు పొడిబారడం, రక్తహీనత ఏర్పడుతుంది.
విటమిన్ పి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల పనితీరు బాగుంటుంది. విటమిన్ పి అనేది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్తమా, కీళ్లవాతం, అలెర్జీలు రాకుండా రక్షిస్తుంది.
.
వారికోస్ వీన్స్, చర్మంపై కమిలినట్లు ఉండటం వంటివి రాకుండా ఆపుతుంది. కంటి శుక్లాలు రాకుండా చూపు తగ్గకుండా చేస్తుంది. బ్రెయిన్ పనితీరు బాగుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఆపుతుంది. అయితే క్యాన్సర్‌పై విటమిన్ పి చూపు ప్రయోజనాలపై ఇంకా పరిశోధన జరుగుతోంది.
నిమ్మజాతికి చెందిన పండ్లలో ఈ విటమిన్ పి పుష్కలంగా ఉంటుంది. హై క్వాలిటీ డార్క్ చాక్లెట్‌లోనూ ఇది లభిస్తుంది. కాకపోతే ఆ చాక్లెట్‌లో కోకో 70శాతం వరకు ఉండాలి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా బెర్రీ జాతికి చెందిన అన్ని పండ్లలోనూ ఇది లభిస్తుంది. రెడ్ వైన్, ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఉంటుంది.
అనేక ముదురు రంగు పండ్లు, కూరగాయల రంగుకు ఫ్లేవనాయిడ్లు అంటే విటమిన్-పి కూడా కారణం. ఈ సమ్మేళనాలు ఆలివ్ నూనె, బెర్రీలు, ఉల్లిపాయలు, కాలే, ద్రాక్ష, టమోటాలు, రెడ్ వైన్, టీ, కోకో, యాపిల్స్, ద్రాక్ష, సోయాబీన్స్, సోయా ఉత్పత్తులు, క్రాన్బెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ మొదలైన వాటిలో కనిపిస్తాయి. ఇలా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే బాడీకి కావాల్సిన విటమిన్లు అందుతాయి.