కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ చూశారా?

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ చూశారా? మొత్తం 6 వేరియంట్లలో.. డిజైన్, లుక్ అదిరింది.. ఫొటోలు టాటా మోటార్స్ ఈరోజు జనవరి 13న భారత మార్కెట్లో 2026 టాటా పంచ్‌ను లాంచ్ చేసింది.


2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అక్ప్లిష్డ్, అక్ప్లిష్డ్+ S వేరియంట్లలో లభిస్తోంది. ధరలు రూ. 5.59 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతాయి.

రియర్ వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, AMT వేరియంట్లలో ప్యాడిల్ షిఫ్టర్లు, కనెక్ట్ కార్ టెక్నాలజీ, ఎత్తు అడ్జెస్టబుల్ డ్రైవర్ సీటు, మల్టీ డ్రైవ్ మోడ్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రేంజ్-టాపింగ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.59 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.29 లక్షల వరకు ఉంటుంది.

95కి పైగా యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఆల్పా-ఆర్క్ ఆర్కిటెక్చర్, అల్ట్రా-హై స్ట్రెంగ్త్ స్టీల్‌పై రూపొందించారు.

టాటా మోటార్స్ అప్ డేట్ అయిన పంచ్ 11.1 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ.ల స్పీడ్ అందుకోగలదు. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అలాగే ESC, ABS, TPMS, 360-డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.