ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తనకు పిచ్చెక్కించిందని తెలిపాడు.
ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్ తనను బాగా ఆకట్టుకుందని చెప్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. తొలి టీ20లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్.. రెండో టీ20లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మూడో టీ20లో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాడు. నాలుగో టీ20లో మరోసారి అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
మహేష్ బాబు అంటే ఇష్టం..
గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ.. తెలుగు అభిమానులకు సుపరిచితమే. సినిమా, క్రికెట్ అంటే పడిచచ్చే తెలుగు ఫ్యాన్స్.. అభిషేక్ శర్మ ఫేవరేట్ తెలుగు హీరో గురించి తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నిర్వహించిన ఒక ఫన్ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ.. తన ఫేవరేట్ తెలుగు హీరో మహేష్ బాబు అని తెలియజేశాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమాల గురించి, ఆయనకు ఉన్న క్రేజ్ గురించి తన సహచర తెలుగు ఆటగాళ్లను అడిగి తెలుసుకుంటుంటానని చెప్పాడు.
అల్లు అర్జున్ మేనరిజమ్..
తాను తెలుగు సినిమా చూస్తానని, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాగా నచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్స్‌ను మైదానంలో కూడా అనుకరించాడు. అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ ఇష్టమని ఓ ఇంటరాక్షన్‌లో తెలిపాడు. ఆర్ఆర్ఆర్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా నాటు నాటు పాట బాగుందని, ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుతమైని కొనియాడాడు.
తెలుగు ప్లేయర్లు నితీష్ రెడ్డి, తిలక్ వర్మల సాయంతో తెలుగు డైలాగ్స్ నేర్చుకుంటానని చెప్పాడు. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని, రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ చూడాలని ఉందని తెలిపాడు.


































